చైనా అందిస్తున్న రుణాల గురించి దక్షిణ, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డొనాల్డ్ లూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాలు తమ ఆర్థిక అవసరాల కోసం చైనా రుణాలపై ఆధారపడటం ఆందోళన కల్గిస్తుందన్నారు.
ఆ రుణాలను బలవంతపు పరపతి కోసం, ఇతర అవసరాల తీర్చుకోవడానికి చైనా ఉపయోగించుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. ఆయా దేశాలు తమ సొంత నిర్ణయం తీసుకోవటానికి బయటి దేశాల ప్రభావానికి గురి కావద్దని ఒక మీడియా సమావేశంలో డొనాల్డ్ లూ స్పష్టం చేశారు.
ఈ చైనా సమస్యపై భారత్- అమెరికాల మధ్య తీవ్రమైన సంభాషణ జరిగిందని కూడా చెప్పారు డొనాల్డ్ లూ. కాగా, అంతకుముందు రోజే పాకిస్తాన్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ బోర్డ్ ఆఫ్ చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్ (సీడీబీ) దేశానికి 700 మిలియన్ డాలర్ల క్రెడిట్ సదుపాయాన్ని ఆమోదించినట్లు ప్రకటించారు.
ఐతే క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశం లేదా దేశాల సముహానికి విరుద్ధమైన సంస్థ కాదని చెప్పారు. ఓపెన్ ఇండో ఫసిఫిక్‌కు మద్దతు ఇచ్చే కార్యకలాపాలు, విలువలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుందని డొనాల్డ్ లూ అన్నారు. అలాగే రష్యాతో భారత్ సైనిక సంబంధం గురించి అడిగినప్పుడూ సైనిక ఒప్పందాల విషయంలో రష్యా పరిస్థితి కాస్త కష్టంగా ఉందన్నారు.
(చదవండి: తప్పట్లేదు.. బిజినెస్ క్లాస్‌లో ప్రయాణం, ఫైవ్ స్టార్ హోటళ్లలో బస వద్దు’)
Comments
Please login to add a commentAdd a comment