
నకిలీ నోట్లు అక్కడక్కడే...
ఆందోళన అక్కర్లేదు: ఆర్‌బీఐ
ముంబై: దేశంలో నకిలీ నోట్ల సమస్య చాలా చిన్నదని, ఇది అక్కడక్కడా వెలుగుచూస్తున్న అంశమని, దీనిపై ఆందోళన చెందాల్సింది ఏదీ లేదనీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ పేర్కొన్నారు. అయితే ఇలాంటి సమస్యలనూ పూర్తిగా నిరోధించడానికి ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటుందనీ, ఔట్‌సోర్డ్స్ క్యాష్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలకు మార్గదర్శకాలను పునఃపరిశీలించనుందని గాంధీ తెలిపారు. గడచిన వారంరోజుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), ఐసీఐసీఐ బ్యాంక్‌లలోని పలు ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చాయన్న వార్తల నేపథ్యంలో గాంధీ ఈ ప్రకటన చేశారు