కొడుకు, అల్లుడి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి తెచ్చారని టీపీసీసీ సమన్వయ...
► విభజనతో ప్రజలకు తీరని నష్టం
► మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : కొడుకు, అల్లుడి కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు తెరపైకి తెచ్చారని టీపీసీసీ సమన్వయ కమిటీ సభ్యుడు, మాజీమంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు ఆరోపించారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతున్న జిల్లాల విభజనతో ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయం వద్ద శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ ‘బిడ్డ కోసం నిజామాబాద్ జిల్లా ఉంది. ఇప్పుడు కొడుకు కోసం సిరిసిల్ల, అల్లుడి కోసం సిద్దిపేటను జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్నారు. శాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగితే మాకేమీ అభ్యంతరం లేదు.
కానీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని జిల్లాలను విభజిస్తున్నారు. కరీంనగర్‌కు సమీపంలోనున్న గంగాధర మండలాన్ని సిరిసిల్లలో కలపడం వారి స్వార్థ రాజకీయాలకు నిదర్శనం. ప్రజాభీష్టానికి భిన్నంగా జిల్లాలను ఏర్పాటు చేస్తే సహించబోం’ అని హెచ్చరించారు.