ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట రైతుల ఆందోళన
జహీరాబాద్ టౌన్: సబ్సిడీ సొమ్ము కాజేశారని ఆరోపిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు ఎదుట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. జహీరాబాద్ మండలం హుగ్గెల్లికి చెందిన పద్మ, కొత్తూర్(బి) గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మితోపాటు మరో ఇద్దరు రైతులు ట్రాక్టర్ల కోసం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. సదరు రైతులు ఈఎంఐలు కట్టగా మిగతా మొత్తానికి కార్పొరేషన్ నుంచి సబ్సిడీ మంజూరైంది. దీంతో వారి నుంచి బ్లాంక్ చెక్కులు కూడా తీసుకున్నారు. రుణ బకా రుులు వెంటనే చెల్లించాలంటూ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి ఎస్‌ఎంఎస్, ఫోన్లు రావ డంతో బాధిత రైతులు మూడు రోజుల క్రితం బ్యాంకు మేనేజర్‌ను కలసి ఆరా తీశారు.
హుగ్గెల్లికి చెందిన పద్మకు రూ.2,22,357, కొత్తూర్(బి)కి చెందిన భాగ్యలక్ష్మికి కార్పొరేషన్ నుంచి వచ్చిన రూ.3.75 లక్షల సబ్సిడీ నిధులు వారి ఖాతాలో జమ కాలేదని తెలిసింది. దాదాపు రూ.6 లక్షల నిధులను మరొకరి ఖాతాల్లోకి మళ్లించినట్టు స్పష్టమైంది. ఈ విషయమై ఇద్దరు బాధితులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. తప్పిదం ఎలా జరిగిందో పరిశీలించి న్యాయం చేస్తానని మేనేజర్ హామీ ఇచ్చినా, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ బాధిత రైతులు రైతు సంఘం నాయకులతో కలసి బ్యాంకు ఎదుట బైఠారుుం చారు. కాగా మరో ఇద్దరు లబ్ధిదారులు కూడా ఇలాంటి మోసానికే గురైనట్టు సమాచారం.
సబ్సిడీ సొమ్ము కాజేశారని ధర్నా
Published Fri, Dec 9 2016 4:03 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement