చేపలు పట్టే హక్కు కల్పించండి
► సింగసముద్రం, జక్కులచెరువుల్లో అవకాశం కల్పించడి
► రాచర్లబొప్పాపూర్ ముదిరాజ్‌ల డిమాండ్
► కలెక్టరేట్ ఎదుట ఆందోళన
సిరిసిల్ల : సింగసముద్రం, జ క్కుల చెరువుల్లో చేపలు పట్టే హక్కులు కల్పించాలనే డిమాం డ్‌తో ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ ముదిరాజ్ లు సోమవారం కలెక్టరేట్ ఎ దుట ధర్నా చేశారు. బొప్పాపూర్‌లో 250 కుటుంబాలు ఉన్నాయని, తమకు ఎలాంటి అడవు లు అందుబాటులో లేవన్నారు. దీంతో ఉపాధి లభించక దిక్కు లు చూస్తున్నామని ఆవేదన చెందారు. వ్యవసాయ భూము లు లేక కూలీ పనులు చేసుకుం టున్నామని తెలిపారు.
కులవృత్తి సరిగా లేక మరికొం దరు వలస పోతున్నారని చెప్పారు. జక్కుల చెరువు, సింగసముద్రంలో చేపలు పట్టేందుకు హక్కులు కల్పిస్తే జీవనోపాధికి అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఈమేరకు కలెక్టర్ కృష్ణభాస్కర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు రెడ్డబోయిన గోపి, నర్సయ్య, మల్లేశం, శ్రీనివాస్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.