కశ్మీర్ లోయలో మంగళవారం రాత్రి ఒక ఆస్పత్రి బయట యువకుడి మృతదేహం లభించటంతో మళ్లీ గొడవలు చెలరేగాయి.
శ్రీనగర్: కశ్మీర్ లోయలో మంగళవారం రాత్రి ఒక ఆస్పత్రి బయట యువకుడి మృతదేహం లభించటంతో మళ్లీ గొడవలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో మంగళవారం ఎటువంటి గొడవలూ జరగలేదు. కానీ మృతుని పొట్టలో 300 పెల్లెట్లు ఉన్నట్లు తేలడంతో భద్రతా బలగాలే చంపి ఉంటాయని భావిస్తూ పోలీసులు హత్యారోపణలతో కేసు నమోదు చేశారు.
యువకుడి మృతితో ఆందోళన కారులు మళ్లీ రెచ్చిపోయారు. గొడవల్లో జవాన్లు సహా 70 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. అధికారులు కర్ఫ్యూను మరిన్నిప్రాంతాలకు విస్తరించారు.