breaking news
death of the young man
-
కశ్మీర్లో మళ్లీ పెరిగిన ఉద్రిక్తతలు
శ్రీనగర్: కశ్మీర్ లోయలో మంగళవారం రాత్రి ఒక ఆస్పత్రి బయట యువకుడి మృతదేహం లభించటంతో మళ్లీ గొడవలు చెలరేగాయి. ఈ ప్రాంతంలో మంగళవారం ఎటువంటి గొడవలూ జరగలేదు. కానీ మృతుని పొట్టలో 300 పెల్లెట్లు ఉన్నట్లు తేలడంతో భద్రతా బలగాలే చంపి ఉంటాయని భావిస్తూ పోలీసులు హత్యారోపణలతో కేసు నమోదు చేశారు. యువకుడి మృతితో ఆందోళన కారులు మళ్లీ రెచ్చిపోయారు. గొడవల్లో జవాన్లు సహా 70 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. అధికారులు కర్ఫ్యూను మరిన్నిప్రాంతాలకు విస్తరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ముర్తూజగూడ గేటు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళితే... మహబూబ్నగర్ జిల్లా నందిపాడుకు చెందిన కాశీ(18) స్థానికంగా ఉన్న కంపెనీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం ముర్తూజగూడ వద్ద రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతిచెందాడు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.