రెండేళ్ల మోదీ పాలనలో భారత్‌లో మానవహక్కులు, మత స్వేచ్ఛ నానాటికీ దిగజారుతున్నాయని...
అంతర్జాతీయ మానవహక్కుల కార్యకర్తల ఆందోళన
వాషింగ్టన్/న్యూఢిల్లీ: రెండేళ్ల మోదీ పాలనలో భారత్‌లో మానవహక్కులు, మత స్వేచ్ఛ నానాటికీ దిగజారుతున్నాయని అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారత్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశాన్ని చేర్చాల్సిందిగా వారు అమెరికాను కోరారు. హాని జరిగే ప్రమాదం ఉన్న వర్గాలకు రక్షణ కల్పించడంతో పాటు ప్రజలకు సమన్యాయం, జవాబుదారీతనం అందించడంలో మోదీ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందని హ్యూమన్ రైట్ వాచ్ సంస్థకు ఆసియా అడ్వొకసీ డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న జాన్ షిఫ్టన్ అభిప్రాయపడ్డారు.
చట్టాలను సమర్థవంతంగా అమలు చేయకపోవడంతో ఇది నిరంతర సవాల్‌గా కొనసాగుతోందన్నారు. ప్రభుత్వాధికారుల్లో జవాబుదారీతనం లోపించడం, పోలీసులు, భద్రతాధికారుల నిర్లక్ష్యం కారణంగా తీవ్రమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినవారు కూడా చట్టం నుంచి సులువుగా తప్పించుకుంటున్నారన్నారు.
శాసన వ్యవస్థను కోర్టులు నిర్ణయించలేవు
శాసన వ్యవస్థ నిర్ణయాల్లో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవటం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పునరుద్ఘాటించారు. శాసన, న్యాయ వ్యవస్థలకు ఎవరికి వారికి స్వతంత్ర అధికారాలున్నందున ఇతర వ్యవస్థల్లో జోక్యం చేసుకోకూడదన్నారు. ఢిల్లీలో జరిగిన ‘ఇండియన్ ఆఫ్ ద ఇయర్-2015’ కార్యక్రమంలో జైట్లీ మాట్లాడారు.