నిలిచిన కేబుల్ ప్రసారాలు | Cable operators concern statewide on ramesh murger | Sakshi
Sakshi News home page

నిలిచిన కేబుల్ ప్రసారాలు

Published Tue, Jun 7 2016 4:09 AM | Last Updated on Mon, Sep 4 2017 1:50 AM

Cable operators concern statewide on ramesh murger

కేబుల్ ఆపరేటర్ హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బీరంగూడలో కేబుల్ ఆపరేటర్ రమేశ్ హత్యను నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలిపారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఆపరేటర్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు లింగాల హరిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసన విజయవంతమైందని తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement