statewide
-
రూ. కోట్లకొద్దీ డబ్బు, బంగారం స్వాధీనం
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో హైదరాబాద్ సహా జిల్లాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు ప్రారంభించారు. ఎన్నికల్లో అక్రమంగా డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు, నాకా బందీలు పెట్టి సోదాలు నిర్వహించారు. ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేకుండా తరలిస్తున్న నగదు, బంగారం, వెండి, ఇతర వస్తువులను స్వాదీనం చేసుకున్నారు. వాటిని ఆదాయపన్ను శాఖ అధికారులకు అప్పగించారు. రాజధాని పరిధిలో... బషీర్‌బాగ్ నిజాం కళాశాల వద్ద వాహన తనిఖీ ల్లో ఓ బంగారం దుకాణానికి చెందిన, ఎలాంటి పత్రాల్లేని 7 కిలోల బంగారం, 295 కిలోల వెండిని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 7.5 కోట్లు ఉండొచ్చని చెప్పారు. పురానాపూల్ వద్ద బేగంబజార్‌కు చెందిన ఒకరి నుంచి రూ.15 లక్షలు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చైతన్యపురి పరిధిలో బైక్‌పై వెళుతున్న ఇద్దరు వ్యక్తులు ఆధారాల్లేకుండా తరలిస్తున్న రూ.25 లక్షలను స్వాదీనం చేసుకున్నారు. అదే ప్రాంతంలో షాద్‌నగర్‌కు చెందిన స్క్రాప్ వ్యాపారి సంతోష్ చంద్రశేఖర్ (48) నుంచి రూ. 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా లాల్‌పహాడ్ చౌరస్తా వద్ద తనిఖీల్లో 2 కిలోల బంగారం, రూ. 1.22 లక్షలు పట్టుబడ్డాయి. ఆగాపురా హమీద్ కేఫ్ చౌరస్తాలో షాహీన్ నగర్‌కు చెందిన మహ్మద్ అబ్దుల్ నుంచి రూ. 5 లక్షలు, బేగంబజార్‌కు చెందిన దినేష్ ప్రజాపతి నుంచి రూ.12 లక్షల నగదు స్వాదీనం. షేక్‌పేట నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ కారులో తరలిస్తున్న రూ. 30 లక్షలు సీజ్. వనస్థలిపురం పరిధిలో ఓ కారులో సంరెడ్డి భరత్‌రెడ్డి తీసుకెళ్తున్న రూ. 5.16 లక్షలు స్వాధీనం. గోపాలపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జీలో చేపట్టిన తనిఖీల్లో పట్టుబడ్డ రూ. 4 లక్షలు. పంచశీల క్రాస్ రోడ్స్ వద్ద గోపి అనే వ్యక్తి నుంచి రూ. 9.3 లక్షలు స్వాదీనం. వివిధ జిల్లాల్లోనూ... రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి బీడీఎల్ చౌరస్తా వద్ద తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ. 9,38,970తో పాటు గాయత్రి ఆస్పత్రి వద్ద తనిఖీల్లో మరో కారులో తరలిస్తున్న రూ.71,50,000 నగదును పోలీసులు పట్టుకున్నారు. అలాగే షాద్‌నగర్ టోల్ ప్లాజా వద్ద సంగారెడ్డికి చెందిన నగేష్ నుంచి రూ.7 లక్షలతోపాటు షాద్‌నగర్‌లోని జీహెచ్ఆర్ కాలనీకి చెందిన అశోక్ బైక్‌పై తీసుకెళ్తున్న రూ. 11.50 లక్షలను సీజ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి వద్ద తనిఖీల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన వ్యాపారి కారులో తరలిస్తున్న రూ. 5.40 లక్షల నగదును స్వా«దీనం చేసుకొన్నారు. ఏపీకి చెందిన వారి నుంచి వైరాలోని చెక్‌పోస్టు వద్ద రూ.5లక్షలు, తల్లాడ సూపర్ మార్కెట్ యజమాని కొత్తూరి సైదకుమార్ రూ. 5 లక్షలను సీజ్ చేశారు. మధిర వద్ద తనిఖీల్లో కోనా గోపాలరావు అనే వ్యక్తి నుంచి రూ.12.65 లక్షలను సీజ్ చేశారు. -
పగటి దోమ కాటు ప్రాణాంతకమే!
పగటిపూట కుట్టే దోమ ప్రాణాంతకంగా పరిణమించింది. డెంగీ వ్యాప్తికి కారణమైన ఏడిస్ ఈజిప్టి దోమలతో జ్వర బాధితులు పెరుగుతున్నారు. డెంగీ కారక దోమల బెడద నుంచి రక్షించుకోవడమే శ్రేయస్కరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దోమల ఉత్పత్తికి కారణమయ్యే నిల్వ నీరు లేకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ వానలు కురిసి తగ్గిన తర్వాత సీజన్లో సాధారణంగా డెంగీ వ్యాపిస్తుంది.. కానీ ఈ వ్యాధి ప్రస్తుతం నగరవ్యాప్తంగా ప్రబలుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3వేలకుపైగా డెంగీ కేసులు నమోదైతే.. అందులో సగానికి పైగా నగరంలో నమోదవడం వ్యాధి తీవ్రతకు నిదర్శనం. గత ఆగస్టు నుంచి నెలకు 10 రెట్ల చొప్పున కేసులు పెరుగుతున్నాయని ఆసుపత్రుల గణాంకాలు చెబుతున్నాయి. డెంగీ జ్వరం వస్తే శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గి ప్రాణాంతకంగా మారుతుంది. ఈ నేపధ్యంలో దోమల నివారణకు నగర ప్రజలు ప్రాధాన్యమివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. ఏడిస్ ఈజిప్టి దోమ కాటేసే వేళలివే.. డెంగీకి దోహదం చేసే ఏడిస్ ఈజిప్టి అనే దోమనే ఎల్లో ఫీవర్ మస్కిటో అనే పేరుతోనూ పిలుస్తారు. ఈ దోమలు ప్రధానంగా ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య, సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఎక్కువగా కుడతాయి. కాబట్టి ఈ సమయంలో దోమలు కుట్టకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ దోమలు చీలమండలు, మోచేతుల దగ్గర ఎక్కువగా కుడతాయని గ్రహించాలి. వీలుంటే ఆయా శరీర భాగాల్లో మనకు మార్కెట్లో లభించే దోమల నివారణ లేపనం పూయాలి. నిల్వ నీరే స్థావరాలు నీరు నిల్వ ఉన్న చోట, తడి ప్రదేశాలలో ఈ దోమలు విపరీతంగా గుడ్లను పొదుగుతాయి. అవి మూడేళ్ల వరకు జీవించగలవు. కాబట్టి ఇంట్లో లేదా మరెక్కడైనా సరే మూలల్లో తడిగా, నీటి నిల్వ లేకుండా చూసుకోవాలి. కొందరు మొక్కల కుండీల్లో నీటిని వదిలేస్తారు. అది కూడా ఈ దోమలకు స్థావరంగా మారుతుందని గుర్తుంచుకోవాలి. దోమను ఎలా గుర్తించాలంటే.. ఏడిస్ ఈజిప్టి దోమను గుర్తించడానికి సులభమైన మార్గం వాటి నలుపు రంగు. కాళ్లపై తెల్లటి మచ్చలుంటాయి. దోమలను బయటకు తరిమికొట్టేందుకు ఇప్పుడు మార్కెట్లో మస్కిటో కాయిల్స్, లిక్విడ్స్ సహా అనేక రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వీటిలో చాలా వరకూ పరోక్షంగా ఆరోగ్యానికి హాని కలిగించేవే. వాటి నుంచి విడుదలయ్యే కాలుష్యం ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎంచుకోవాలి. తులసి నూనె: దోమలను తరిమికొట్టడానికి తులసి నూనె చాలా ప్రభావవంతమైనది. ఇది కీటక–వికర్షక సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని వాసన దోమలను దూరంగా ఉంచుతుంది. లెమన్ గ్రాస్ ఆయిల్: దోమల నుంచి రక్షణ కోసం లెమన్ గ్రాస్ ఆయిల్‌ను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ఈ నూనెను రాసుకుంటే కొన్ని గంటలపాటు దోమల నుంచి రక్షణ లభిస్తుంది. లావెండర్ ఆయిల్: చర్మంపై లావెండర్ ఆయిల్‌ను రాసుకుని ఆరుబయట సంచరించినా, నిద్రపోయినా దోమలు కుట్టవు. పిప్పరమింట్ స్ప్రే: కొబ్బరి నూనెలో పిప్పరమెంటు బిళ్లను కలిపి స్ప్రే బాటిల్లో నింపాలి. పిప్పరమింట్ ఆయిల్ దోమలను తరిమికొట్టడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆయిల్: నిమ్మకాయ,యూకలిప్టస్ నూనెను సమాన పరిమాణంలో కలపాలి. అదే నూనెలో ఆలివ్, కొబ్బరి, అవకాడో నూనె వేసి స్ప్రే బాటిల్లో నింపాలి. ఈ మిశ్రమాన్ని శరీరంపై స్ప్రే చేసుకోవడం ద్వారా దోమల బెడద నుంచి రక్షించుకోవచ్చు. -
నేడు తుది దశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద తుదిదశ ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు బుధవారం జరగనుంది. ఈ విడతలో వివిధ బ్రాంచీలకు చెందిన 19 వేల సీట్లను కేటాయించాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కన్వినర్ కోటా కింద 82,666 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా తొలి విడతలో 70,665 మందికి సీట్లు కేటాయించారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో మిగిలిన 12,013 సీట్లతోపాటు ఆ విడతలో సీట్లు లభించినా రిపోర్టు చేయకపోవడంతో మిగిలిపోయిన 18 వేల సీట్లను కలిపి రెండో దశలో 30 వేలకుపైగా సీట్లు కేటాయించారు. రెండో దశలోనూ 12 వేల సీట్లు మిగిలిపోయాయి. ఆ విడతలో సీట్లు లభించినా 7 వేల మంది చేరలేదు. దీంతో తుది విడత కౌన్సెలింగ్‌లో 19 వేల వరకూ సీట్లు కేటాయించనున్నారు. 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ తుది విడత సీట్లు కేటాయించిన అభ్యర్థులు ఈ నెల 10 నుంచి 12లోగా సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలి. లేకుంటే సీటు రద్దవుతుంది. ఇందులో మిగిలిపోయిన సీట్లకు ఈ నెల 17 నుంచి ప్రత్యేక కౌన్సెలింగ్ జరగనుంది. ఎన్ఐటీ, ఐఐటీ సీట్ల కేటాయింపునకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కూడా పూర్తవ్వడంతో వాటిల్లో సీట్లు పొందని వారికి ఇది ఉపయోగపడుతుంది. స్పెషల్ కౌన్సెలింగ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తవ్వగానే ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 25లోగా కాలేజీల్లో నేరుగా రిపోర్టు చేసి సీటు దక్కించుకోవాలి. ఒక కాలేజీలో తుది విడత కౌన్సెలింగ్‌లో ఏదైనా బ్రాంచీలో సీటు వచ్చి ప్రత్యేక కౌన్సెలింగ్‌లో వేరొక బ్రాంచీలో సీటు వస్తే కేటాయింపు పత్రాన్ని సమర్పించి సీటు మార్పిడి చేసుకోవాలి. వేరొక కాలేజీలో సీటు వచి్చన పక్షంలో అంతకుముందు రిపోర్టు చేసిన కాలేజీలో టీసీ, ఇతర సరి్టఫికెట్లను ఈ నెల 25లోగా తీసుకొని ప్రత్యేక కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో రిపోర్టు చేయాలి. యాజమాన్య కోటా సీట్ల పరిశీలన ఎంసెట్ కౌన్సెలింగ్ తుది దశకు చేరుకుంటున్న నేపథ్యంలో యాజమాన్య కోటా సీట్ల కేటాయింపుపై ఉన్నత విద్యామండలి దృష్టి పెట్టింది. ప్రత్యేక కౌన్సెలింగ్ పూర్తయ్యేలోగా ప్రైవేటు కాలేజీలు యాజమాన్య కోటా సీట్ల భర్తీ వివరాలను పంపాలని అధికారులు కోరుతున్నారు. ప్రతి కాలేజీలోనూ 30 శాతం యాజమాన్య కోటా ఉంటుంది. ఇందులో 15 శాతం ఎన్ఆర్ఐ సిఫార్సులకు సీట్లు ఇస్తారు. మిగిలిన 15 శాతం సీట్లను నిబంధనల ప్రకారం భర్తీ చేయాలి. జేఈఈ, ఎంసెట్ ర్యాంకులను, ఇంటర్లో వచి్చన మార్కులను ప్రాతిపదికగా తీసుకోవాలి. ఈ రూల్స్ ఎంతమేర పాటించారనేది అధికారులు పరిశీలిస్తారు. -
లక్షల్లో ఉత్తీర్ణులు.. వేలల్లో పోస్టులు, ఇదేం తీరు సర్కారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా టెట్‌లో అర్హత సాధించినవారు 4,19,030 మంది ఉన్నారు. అయితే విద్యాశాఖలో ఉపాధ్యాయ ఖాళీలు కేవలం 22 వేల వరకే ఉన్నాయి. లక్షల్లో ఉత్తీర్ణులు అయ్యి ఉంటే వేలల్లో పోస్టులు భర్తీ చేస్తే ప్రయోజనం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నస్తున్నారు. ఉమ్మడిరాష్ట్రంలో టెట్, డీఎస్సీ ఒకేసారి నిర్వహించేవారు. దీంతో కొంతమంది టీచర్ ఉద్యోగాలు పొందేవారు. వాస్తవానికి 2022లో భారీ నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వం ఆశలు కల్పించింది. దీంతో ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్నవారు కూడా ఉద్యోగాలు మానేసి టీఆర్టీ (టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్) కోసం సన్నద్ధమయ్యారు. కానీ వారి ఆశలన్నీ అడియాసలయ్యాయి. టీచర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రానేరాలేదు. ఈ నేపథ్యంలో యువతలో నెలకొన్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకునే టెట్‌ను ముందుకు తెచ్చారనే విమర్శలొస్తున్నాయి. కోర్టు స్టేతో ఆగిన పదోన్నతుల ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 22 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నట్టు విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లు, స్కూల్ అసిస్టెంట్లను హెచ్ఎంలుగా పదోన్నతి కల్పిస్తే దాదాపు 12 వేల పోస్టులు ఖాళీ అవుతాయి. ఉద్యోగ విరమణ వల్ల ఖాళీ అయిన పోస్టులు, కొత్తవి కలుపుకుంటే 22 వేల వరకూ ఉంటాయని అంచనా. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2022లో పదోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టారు. అయితే ఇది పూర్తవ్వకుండానే కోర్టు స్టేతో ఆగిపోయింది. కనీసం పదోన్నతులు అయినా ఇవ్వొచ్చని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. పదోన్నతులు, బదిలీలు చేపడితే తప్ప ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల భర్తీ సాధ్యం కాదని విద్యాశాఖ స్పష్టం చేస్తోంది. నియామకాలు చేపట్టకపోవడంతో రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు అర్హత సాధించినా, అనేక మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఎన్నికల వేళ నోటిఫికేషన్ ఇవ్వడం సాధ్యం కాకపోతే తమ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని నిరుద్యోగులు అంటున్నారు. టీఆర్టీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలి టెట్ నిర్వహణను స్వాగతించాల్సిందే. ఇదే క్రమంలో ప్రభుత్వం ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోతే టెట్ ఉత్తీర్ణులైనా ప్రయోజనం ఏముంటుంది. టీచర్ పోస్టుల భర్తీపై గతంలో సీఎం అసెంబ్లీలోనే హామీ ఇచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా టీఆర్టీపై దృష్టి పెడితే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. టీచర్ పోస్టుల కోసం 4 లక్షల మంది ఎదురుచూస్తున్నారని ప్రభుత్వం తెలుసుకోవాలి. – రావుల రామ్మోహన్ రెడ్డి (తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
చేపా.. చేపా ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: మత్స్యకారులకు చేయూతనందించేందుకు ప్రభుత్వం అమలుచేస్తున్న ఉచిత చేపపిల్లల పంపిణీ ఈసారి ఆలస్యమయ్యే సూచనలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ముందస్తుగా చేపపిల్లలను చెరువుల్లో వదలాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే చెరువులు అలుగు దూకుతుండడంతో పంపిణీకి కొద్దిరోజులు ఆగితే మంచిదనే ఆలోచనలో మత్య్సశాఖ ఉంది. కొన్ని చెరువులు పూర్తిగా నిండగా, మరికొన్ని చెరువులు సగంకంటే ఎక్కువగా నిండాయి. నిండిన చెరువుల్లో ఇప్పుడే చేపపిల్లలు వదిలితే.. మళ్లీ భారీ వర్షాలు కురిస్తే.. అవి కొట్టుకుపోయే ప్రమాదముంది. అలాగని, సకాలంలో వదలకపోతే ఎదుగుదల లోపిస్తుంది. దీంతో అధికారులు తర్జనభర్జనపడుతున్నారు. గతేడాది తేలని లెక్క గతేడాది ప్రభుత్వం గుర్తించిన చెరువుల్లో ఉచిత చేపపిల్లలు వదిలిన తర్వాత భారీ వర్షాలతో చెరువులు అలుగుదూకాయి. దాదాపు 80 శాతం చెరువుల్లోని చేపలు కొన్ని ఎదురెక్కిపోతే, మరికొన్ని కొట్టుకుపోయాయి. దీంతో ఏ చెరువులో ఎన్ని చేపలున్నాయనే లెక్క తేలలేదు. ఈసారి 43,870 చెరువుల్లో 24వేల చెరువులు పూర్తిగా నిండి అలుగు దూకాయి. మిగతా చెరువుల్లో సగానికంటే ఎక్కువగానే అలుగు దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది చేప, రొయ్యలు కలిపి 71.02 కోట్ల మేరకు చెరువుల్లో వదిలారు. ఈసారి రెండూ కలిపి 99 కోట్ల వరకు వదలాలని మత్స్యశాఖ యోచిస్తోంది. అందుకనుగుణంగా టెండర్లను సిద్ధం చేసింది. అప్పుడే కాదు భారీ వర్షాలు కురుస్తుండడంతో కొద్ది రోజులు ఆగిన తర్వాత చెరువుల్లో చేప, రొయ్యపిల్లలు వదలాలని అనుకుంటున్నాం. ఈసారి వంద శాతం రాయితీపై చేపపిల్లలు పంపిణీ చేస్తాం. – తలసాని శ్రీనివాస్‌యాదవ్, మత్స్యశాఖ మంత్రి -
లక్ష మంది రైతులతో వ్యవసాయ సలహా మండళ్లు
సాక్షి, అమరావతి : ‘ఎంతో అనుభవజ్ఞులైన లక్షమంది రైతులతో రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ సలహా మండళ్లు ఏర్పాటయ్యాయి. ఇంతపెద్ద వ్యవస్థ మరే రాష్ట్రంలోనూ లేదు. వీరి సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు చెయ్యొచ్చు’.. అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన ఈ సలహా మండళ్లను వ్యవసాయపరంగా అన్ని అంశాల్లో భాగస్వాములను చేస్తున్నామన్నారు. రైతులకు మరింత మెరుగైన సేవలందించేందుకే ఈ మండళ్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో శుక్రవారం 13 జిల్లాల వ్యవసాయ సలహా మండళ్ల చైర్మన్లతో జరిగిన రాష్ట్రస్థాయి అవగాహన సదస్సులో మంత్రి కన్నబాబు మాట్లాడారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఏర్పాటుచేసిన ఈ సలహా మండళ్ల సహకారంతో రాష్ట్రంలో వ్యవసాయరంగం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వ్యవసాయ, ఉద్యాన, సహకార, పట్టుసాగు, చేపలు రొయ్యల పెంపకం తదితర అన్ని అంశాల్లో ఈ మండళ్లు సూచనలిస్తే వాటిని సీఎం దృష్టికి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింతగా అభివృద్ధి చెయ్యొచ్చన్నారు. సాగుచేసే ప్రతి ఎకరాను ఈ–క్రాప్‌లో నమోదు చేయించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని మంత్రి కన్నబాబు అన్నారు. బోర్ల కింద వరి పండించకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ–క్రాప్, సీఎం యాప్‌లను మరింత సరళతరం చేసి రైతులకు అర్ధమయ్యేలా చెయ్యాలన్నారు. అనంతరం వ్యవసాయ సలహా మండళ్ల ఆవిర్భావం, ఉద్దేశ్యాలు, బాధ్యతలు తదితర అంశాలపై వివిధ శాఖల ఉన్నతాధికారులు అవగాహన కల్పించారు. పంటల ప్రణాళిక, డిమాండ్ మేరకు ఉత్పత్తి, పంటల మార్పు, రైతులకు ఆర్బీకేలో అందుతున్న సేవలు, మార్కెట్ ఇంటెలిజెన్స్, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సలహాలిస్తూ రైతుల్ని చైతన్యపరచాలని సూచనలు చేశారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, ఏపీ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ అనుబంధ శాఖల కమిషనర్లు అరుణ్‌కుమార్, ప్రద్యుమ్న, శ్రీధర్, అహ్మద్‌బాబు, కన్నబాబు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, ఏపీ సీడ్స్, ఆయిల్ ఫెడ్, ఆగ్రోస్ ఎండీలు శేఖర్‌బాబు, శ్రీకంఠనాథరెడ్డి, కృష్ణమూర్తి, సీడ్స్ సర్టిఫికేషన్ డైరెక్టర్ త్రివిక్రమరావు తదితరులు పాల్గొన్నారు. -
తడిసి ముద్దయిన తెలంగాణ: నేడూ కూడా
సాక్షి, నెట్వర్క్: భారీ వర్షాలకు రాష్ట్రం తడిసి ముద్దయింది. అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రంలో 2.23 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా వికారాబాద్‌లో 5.6 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ప్రాంతంవారీగా.. మంచిర్యాల జిల్లా హాజీపూర్‌లో అత్యధికంగా 20.85 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా మంబాలో 15.3 సెంటీమీటర్లు, కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 12.8 సెం.మీ., జగిత్యాల జిల్లా వెల్గటూరులో 12.3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా 15 మండలాల్లో పది సెంటీమీటర్లకు మించి వర్షం కురిసింది. రాష్ట్రంలో నైరుతి సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 22.64 సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 34.31 సెంటీమీటర్ల వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా పది జిల్లాల్లో అత్యధిక వర్షపాతం, 19 జిల్లాల్లో అధిక వర్షపాతం, 4 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండల కందనెల్లి బ్రిడ్జి వద్ద తాండూరు–హైదరాబాద్ రోడ్డు కొట్టుకుపోయింది. దోర్నాల్ సమీపంలోని కాగ్నా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన తెగిపోయింది. కామారెడ్డి జిల్లాలో నీట మునిగిన వేలాది ఎకరాలు కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, జుక్కల్, పిట్లం, బిచ్కుంద, పెద్దకొడప్గల్, నిజాంసాగర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. బిచ్కుంద మండలంలోని మెక్క, గుండె కల్లూర్, ఖద్గాం, రాజుల్లా, మిషన్కల్లాలి, కందార్పల్లి, గుండె కల్లూర్, జుక్కల్ మండలంలోని గుల్లా, లడేగాం, నాగల్గాం, మద్నూర్ మండలంలోని చిన్న టాక్లీ, పెద్ద టాక్లీ, సిర్పూర్, దోతి, ఇలేగావ్, కుర్లా తదితర గ్రామాల పరిధిలోని వాగులు పొంగి ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల పంటచేలు నీట మునిగిపోయాయి. నిజామాబాద్ జిల్లాలో చెరువులకు జలకళ నిజామాబాద్ జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, వంకలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటపొలాలు నీటమునిగాయి. జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పట్టణ ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జలపాతాలిలా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చర జలపాతాల వద్ద వరద నీరు పోటెత్తుతోంది. కుంటాల జలపాతం వద్ద నీరు పైనుంచి ఎగిసి పడుతుండటంతో సందర్శకులను వ్యూ పాయింట్ వరకే అనుమతిస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని వర్షాలకు ప్రాణహిత ఉప్పొంగడంతో భారీగా వరద నీరు వచ్చి గోదావరిలో కలుస్తోంది. మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి, చెన్నూరు, భీమిని మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో దాదాపు 33 గ్రామాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మామడ మండలంలోని అనంతపేట్-టెంబుర్ని గ్రామాల మధ్య రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. నర్సాపూర్(జి) మండలకేంద్రం నుంచి దేవునిచెరువు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. కడెం మండలంలోని అటవీ గ్రామం ఇస్లాంపూర్‌కు వెళ్లే మార్గంలో నాలుగు వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. భద్రాద్రి జిల్లాలో రాకపోకలకు ఇబ్బందులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని నుంచి ఉల్వనూరు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతిన్నది. దీంతో వాహనాల రాకపోకలు ఇబ్బందులు ఎదురయ్యాయి. సుజాతనగర్ మండలంలోని నరసింహసాగర్, సర్వారం గ్రామాల మధ్య రైల్వే వంతెనను వరదనీరు ముంచెత్తింది. వరదపోటుతో నరసింహసాగర్, అంజనాపురం, బేతంపూడి, గద్దెలబోరు తదితర గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. టేకులపల్లి మండలంలో సంపత్‌నగర్, అనిశెట్టిపల్లి మధ్య వాగు ప్రవహిస్తుండగా రాకపోకలు స్తంభించాయి. నేడూ భారీ వర్షాలు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది మధ్యస్థ ట్రోపోస్పియర్ స్థాయి వరకు వ్యాపించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి వైపు వంగి ఉన్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు (గంటలకు 40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా బిజిలీ బంద్
-
నేడు డిగ్రీ కళాశాలల బంద్
ఏలూరు సిటీ : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిందని, దీనిలో భాగంగా జిల్లాలో బంద్‌ను జయప్రదం చేయాలని నగర సంఘటనా కార్యదర్శి ఎ.శ్రీకాంత్ తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని సేవాభారతి కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం జరిగింది. బంద్‌కు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. జీవో 35ను రద్దు చేయాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నాయకులు సందీప్, అనుదీప్, పవన్ పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి కరాటేలో ప్రతిభ కనభర్చిన మెదక్ విద్యార్థులు
మెదక్ :జిన్నారం మండలం అన్నారంలో ఆదివారం జరిగిన బుడోకాన్ కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీల్లో మెదక్ విద్యార్థులు ప్రతిభ కనబర్చినట్లు కరాటే మాస్టర్ జీఎన్ రవి తెలిపారు. పోటల్లో ప్రతిభ కనబర్చిన వారికి కరాటే చీఫ్ రవీందర్ మెడల్స్ ప్రదానం చేశారు. పోటీల్లో మెదక్ చెందిన శివకుమార్, హరి, సుప్రియ, శృతి, ప్రేమ్‌కుమార్, అరవింద్, వరుణ్‌గౌడ్, సునీల్‌తో పాటు మరో నలుగురు విద్యార్థులు ప్రతిభను కనబర్చినట్లు తెలిపార\. -
నిలిచిన కేబుల్ ప్రసారాలు
కేబుల్ ఆపరేటర్ హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బీరంగూడలో కేబుల్ ఆపరేటర్ రమేశ్ హత్యను నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలిపారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఆపరేటర్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు లింగాల హరిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసన విజయవంతమైందని తెలిపారు. -
జడివాన..!
ఎడతెరిపిలేని వర్షాలతో తడిసిముద్దవుతోన్న రాష్ట్రం సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు ఊపందుకోవడంతో తెలంగాణ రాష్ట్రం వర్షాలతో తడిసి ముద్దవుతోంది. నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ జలాలు పెరుగుతున్నాయి. బావులు, బోర్లలోకి నీరు వచ్చి చేరుతోంది. కొన్నిచోట్ల చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా సాయంత్రం పూట వర్షం కురుస్తూనే ఉంది. వచ్చే 15వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ శాఖ శుక్రవారం వెల్లడించింది. మహబూబ్‌నగర్ మినహా రాష్ట్రవ్యాప్తంగా వివిధ చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వర్షాల ప్రభావం కొనసాగితే ఆయా జిల్లాల్లోని జలాశయాలు నిండే అవకాశాలున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈ నెలాఖరు వరకే కొనసాగుతాయి కాబట్టి ఈ లోగా కురిసే వర్షాలే అటు రబీ పంటలకు, ఇటు ఎండాకాలంలో తాగునీటికి ప్రయోజనకరంగా ఉండనున్నాయి. కొద్దిరోజులుగా వర్షాలు లేక ఎండిపోయే దశకు చేరుకున్న పంటలు తాజా వర్షాలతో ఊపిరిపీల్చుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకూ తీవ్ర నిరాశలో కూరుకుపోయిన రైతన్న వరి సహా ఇతర రబీ పంటల సాగుకు సమాయత్తమవుతున్నాడు. గత వారం సరాసరి 33.9 మిల్లీమీటర్ల వర్షపాతం రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు కురిసిన వర్షాలకు సరాసరి 33.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ముంచెత్తుతోంది.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను నాలుగు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం రాత్రి 8.30 గంటల వరకు నగరంలో రెండు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. జడివానతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతున వరదనీరు పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాయంత్రం వేళ వర్షం కురియడంతో పలు ప్రధాన రహదారులపై భారీగా వాన నీరు నిలిచిపోయింది. గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు నానా అవస్థలు పడ్డారు. రాగల 24 గంటల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. -
అమ్మా బెలైల్లినాదో..
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా బోనాల పండుగ - కిటకిటలాడుతున్న పోచమ్మ మందిరాలు సాక్షి, ముంబై : రాష్ట్రవ్యాప్తంగా పోచమ్మ పండుగలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఆషాఢ మాసం నుంచి తెలుగువారు ఈ పోచమ్మ పండుగను ఎన్నో యేళ్లుగా జరుపుకుంటున్నారు. కామాటిపురాలో చాలా యేళ్ల కిందటే పోచమ్మ గుడిని నిర్మించి పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కామాటిపురాతోపాటు వర్లీ, దాదర్, బోరివలి, ఘాట్కోపర్, ఠాణే, భివండీ, షోలాపూర్ తదితర ప్రాంతాల్లో పోచమ్మ గుడులు వెలిశాయి. ఈసారి ఆషాఢ మాసం జూన్ 27వ తేదీన ఆషాఢ అమావాస్యతో ప్రారంభంకాగా జూలై 26వ తేదీన ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరికీ సెలవు దినాలైన జూలై 6, 13, 20 తేదీల్లో పెద్ద ఎత్తున పోచమ్మ ఆలయాల్లో భక్తుల రద్దీ కన్పించనుంది. వర్షాకాలంలో వచ్చే కలరా, ప్లేగు, మశూచి వంటి అంటు వ్యాధులు ప్రబలకుండా, ప్రకృతి బీభత్సాలు జరుగకుండా, పాడిపంటలను, తమ పిల్లలను చల్లగా చూడమని పోచమ్మతల్లిని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తారు. పోచమ్మ పండుగ సందర్భంగా కొందరు పోచమ్మ దేవికి బోనాలు సమర్పించగా, మరికొందరు జంతుబలిని ఇస్తారు. ఆషాఢ మాసంలో పోచమ్మతల్లి పుట్టింటికి వస్తుందని భక్తుల నమ్మకం. అందుకే తమ కూతుళ్లు పుట్టింటికివస్తే ప్రత్యేకంగా చూసుకున్నట్లే ప్రజలందరూ వెళ్లి ఆమెను దర్శించి నైవేద్యం సమర్పించి భక్తిని చాటుకుంటారు. ఉగాది తర్వాత చాలా రోజులకు వచ్చే తెలుగు వారి పండుగ కావడంతో భక్తులు ఎంతో ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటారు. ముంబైలో ఈ పండుగను ఒకే రోజు కాకుండా జ్యేష్ట మాసం ముగిసిన అనంతరం శ్రావణం ప్రవేశించక ముందే వీలున్న రోజుల్లో, సెలవు దినాల్లో బంధుమిత్రులను ఆహ్వానించి ఘనంగా జరుపుకుంటారు. శ్రావణంలో ఉపవాసాలు మొదలవుతాయి కాబట్టి పోచమ్మ ఉత్సవాలు ఈ మాసానికి ముందే ముగుస్తాయి. పోచమ్మ తల్లికి సమర్పించే సామగ్రిలో టెంకాయలు, పసుపు-కుంకుమ, పూలు, ఫలాలు, పాలతోపాటు బెల్లం లేదా పంచదారతో కలిపి వండిన ప్రత్యేకమైన పరమాన్నం ఉంటాయి. వీటిని ఒక పాత్రలో పెట్టి, ప్రమిద వెలిగించి తీసుకొస్తారు. పోచమ్మకు భక్తిశ్రద్ధలతో నైవేద్యం సమర్పిస్తారు. అదేవిధంగా సంప్రదాయంగా వస్తున్న జంతుబలి(కోళ్లు, మేకలు)ని సైతం కొనసాగిస్తున్నారు. బోరివలిలో ఘనంగా ‘బోనాలు’ బోరివలి, న్యూస్‌లైన్: నగరంలో తెలుగు ప్రజలు బోనాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. తూర్పుబోరివలిలోని హనుమాన్ నగర్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్థానికులు శుక్రవారం సాయంత్రం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లో కొలువైన పోచమ్మ తల్లికి సంఘం అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ నేతృత్వంలో బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలను ఎత్తుకొని పలు వీధుల మీదుగా ఊరేగింపుగా వెళ్లారు. ఎస్పీ రోడ్ నుంచి కార్టన్ రోడ్ నం-2లో నుంచి గావ్‌దేవి మందిరం వరకు బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ అమ్మవారికి మహిళలు నైవేద్యం సమర్పించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడూతూ.. 1976లో బోనాల పండుగను ముంబైలో ప్రారంభించామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం.. అక్కడి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పండగగా బోనాలను ప్రకటించడంతో ఈ ఏడాది బోనాలను చాలా ఘనంగా నిర్వహించామని గంగాధర్ తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు, గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, సేకుట పోచవ్వ, భూమల్ల గంగవ్వ, అదరవేని కుంటమల్లు, అవురకొండ నర్సవ్వ, లంబ లింగవ్వ, దేశవేని రవి, ఇడుగునూరి రాాజవ్వ, జయ సుతార్, సాయిల గంగవ్వ, వేగుర్ల లక్ష్మి, అదరవేని పద్మ, పెద్ద పద్మ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ర్టస్థాయి ఎడ్ల పోటీల విజేత కృష్ణా జిల్లా జత
అనంతవరం (కొల్లూరు): రాష్ట్రస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల పందేల్లో కృష్ణా జిల్లా ఎడ్లు సత్తా చాటాయి. అత్యధిక దూరం బరువు లాగి ప్రథమ బహుమతి గెల్చుకున్నాయి. కొల్లూరు మండలం అనంతవరం గ్రామంలో రెండు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం ముగిశాయి. రెండోరోజు పోటీల్లో కృష్ణాజిల్లా విజయవాడకు చెందిన సూరపనేని వేణుగోపాలరావుకు చెందిన ఒక ఎద్దు, ఘంటసాలకు చెందిన బండి పరాస్పరరావు ఎద్దు రెండు కలిసి 2785.7 అడుగుల దూరం బరువు లాగి మొదటి బహుమతిగా రూ.20 వేలు నగదు పొందాయి. అదేవిధంగా చెరుకుపల్లి మండలం, పగిడివారిపాలేనికి చెందిన కుంచన గోపాలరెడ్డి ఎడ్ల జత 2572.6 అడుగులు దూరం లాగి రెండవ బహుమతి(రూ.15వేలు) దక్కించుకున్నాయి. అనంతవరం గ్రామానికి చెందిన దూళిపూడి రంగయ్య మెమోరియల్ ఎడ్లజత 2540.10 అడుగుల దూరం లాగి మూడవ బహుమతి(రూ.10వేలు) సాధించాయి. ప్రకాశం జిల్లా తోటవానిపాలేనికి చెందిన రాయపాటి లక్ష్మీపతి ఎడ్ల జత 2500 అడుగులు దూరం లాగి నాలుగవ బహుమతి(రూ. 5 వేలు) పొందాయి. ఆయా ఎడ్ల యజమానులకు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మైనేని మురళీకృష్ణ, ఎంపీటీసీ సభ్యులు డాక్టర్ కనగాల మధుసూధన్ ప్రసాద్, రైతులు యలవర్తి కోటేశ్వరరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో 168 కేంద్రాల్లో ఓట్లు లెక్కింపు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటు లోక్‌సభ, ఇటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 168 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 లోక్‌సభ స్థానాలకు మొత్తం 598 మంది అభ్యర్థులు, 294 అసెంబ్లీ స్థానాలకుగాను 3910 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్‌ను లెక్కిస్తారు. అనంతరం అంటే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు. -
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
-
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై ఏసీబీ దాడులు
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గత అర్థరాత్రి ఆకస్మిక దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, రంగారెడ్డి, నిజామాబాద్, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లోని నెల్లూరు జిల్లా తడ మండలం బీవీపాలెంలోని చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు దాడిలో రూ. లక్ష నగదును స్వాదీనం. నిబంధనలకు విరుద్ధంగా చెక్‌పోస్ట్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు బయట వ్యక్తులు అధికారులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తరు జిల్లా నరహరిపేట చెక్‌పోస్ట్‌పై దాడి చేసి రహదారిపై వెళ్తున్న పలు వాహనాల నుంచి అక్రమంగా నగదు వసూల్ చేస్తున్న ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఆ చెక్ పోస్ట్ నుంచి రూ. లక్షకుపైగా నగదును స్వాధీనం చేసకున్నారు. అలాగే ఆంధ్ర- ఒడిశా సరిహద్దు ఇచ్ఛాపురం చెక్‌పోస్ట్‌పై నిర్వహించిన దాడుల్లో రూ. 2 లక్షలకుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదుపై ఏసీబీ అధికారులు చెక్ పోస్ట్ సిబ్బందిని ప్రశ్నించిగా వారు మీనమేషాలు లెక్కపేట్టారు. దీంతో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీటితోపాటు నిజామాబాద్ జిల్లా భోదన్ మండలం సాలూరు చెక్‌పోస్ట్‌పై దాడులు నిర్వహించి అధిక మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై దాడి చేశారు. ఆ దాడిలో రూ. లక్షకు పైగా నగదులు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ నగదును స్వాధీనం చేసుకుని అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్ ఫెక్టర్ కిరణ కుమార్ తో పాటు నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అయితే ఏసీబీ చేపట్టిన దాడులు శనివారం ఉదయం కూడా కొనసాగుతున్నాయి. -
రాష్ట్రంలో రాగల 24 గంటల్లో భారీ వర్షాలు
రాగల 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం విశాఖపట్నంలో వెల్లడించింది. దక్షిణ కోస్తా అనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం స్థిరంగా ఉందని తెలిపింది. అలాగే ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర మీదగా అల్ప పీడన ద్రోణి చురుగ్గా కదులుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పలు చోట్ల ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. -
సేవా పన్ను పథకంపై రాష్ట్రవ్యాప్త సదస్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా సేవా పన్నులను చెల్లించడాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంపై (వీసీఈఎస్) పన్నుల విభాగం రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. ఇందులో ఖమ్మం, వరంగల్ తదితర ప్రాంతాలు ఉన్నాయని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ బి.బి. ప్రసాద్ తెలిపారు. ఈ ఏడాది మేలో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పట్నుంచి హైదరాబాద్ జోన్లో ఇప్పటిదాకా 100 దాకా దరఖాస్తులు వచ్చాయని, వీటి ద్వారా వచ్చే సేవా పన్ను మొత్తం సుమారు రూ. 30 కోట్లు ఉండగలదని ఆయన వివరించారు. డిసెంబర్ ఆఖరు దాకా ఈ పథకానికి గడువు ఉన్నందున అప్పటికి వీసీఈఎస్ ద్వారా రూ. 200-300 కోట్ల దాకా వసూలు కావొచ్చని పేర్కొన్నారు. వీసీఈఎస్పై పరిశ్రమల సమాఖ్య ఫ్యాప్సీ సోమవారం ఇక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసాద్ పాల్గొన్నారు. మరోవైపు, ఈ పథకాన్ని వ్యాపార వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని కార్యక్రమంలో పాల్గొన్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సభ్యురాలు (బడ్జెట్ విభాగం) షీలా సాంగ్వాన్ తెలిపారు. వీసీఈఎస్ గడువును మరింత పొడిగించడం గానీ, దీనికి సవరణలు చేయడంగానీ ఉండబోదని ఆమె స్పష్టం చేశారు. 2013-14లో వసూలయ్యే మొత్తం సేవా పన్నులో వీసీఈఎస్ ద్వారా వచ్చే వాటా సుమారు 10 శాతంగా ఉంటందని అంచనాలు ఉన్నట్లు ఫ్యాప్సీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ అయ్యదేవర తెలిపారు.