నేడు డిగ్రీ కళాశాలల బంద్‌ | today degree colleges strike | Sakshi
Sakshi News home page

నేడు డిగ్రీ కళాశాలల బంద్‌

Published Tue, Aug 30 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

today degree colleges strike

ఏలూరు సిటీ : రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ కాలేజీల బంద్‌కు పిలుపునిచ్చిందని, దీనిలో భాగంగా జిల్లాలో బంద్‌ను జయప్రదం చేయాలని నగర సంఘటనా కార్యదర్శి ఎ.శ్రీకాంత్‌ తెలిపారు. స్థానిక పవర్‌పేటలోని సేవాభారతి కార్యాలయంలో సోమవారం కార్యకర్తల సమావేశం జరిగింది. బంద్‌కు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించాలని ఆయన కోరారు. జీవో 35ను రద్దు చేయాలని, విద్యార్థులకు  ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. నాయకులు సందీప్, అనుదీప్, పవన్‌ పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement