ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అటు లోక్సభ, ఇటు అసెంబ్లీ ఓట్ల లెక్కింపు కోసం 168 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో 42 లోక్సభ స్థానాలకు మొత్తం 598 మంది అభ్యర్థులు, 294 అసెంబ్లీ స్థానాలకుగాను 3910 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఓట్లు లెక్కింపు ప్రక్రియ ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కిస్తారు. అనంతరం అంటే ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీగా పోలీసుల భద్రతను కట్టుదిట్టం చేశారు.