Cable Operator
-
Banjarahills: మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. కేబుల్ టెక్నిషియన్ నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: మహిళ బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో తీసి అడ్డంగా బుక్కయ్యాడో యువకుడు. బంజారాహిల్స్ రోడ్‌నెంబర్-2లో ఓ టెక్నీషియన్ చేసిన నిర్వాకమిది. కేబుల్ వర్క్ చేయడానికి వచ్చిన టెక్నీషియన్.. మహిళా బాత్రూమ్లో స్నానం చేస్తుండగా వీడియో చిత్రీకరించాడు. టెక్నీషియన్ చేస్తున్న పనిని గమనించిన కొందరు స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. చదవండి: (టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం.. ప్రయోజకురాలవుతుందనుకుంటే..) -
కోడెల ఇంటి ముందు కేబుల్ ఆపరేటర్ ధర్నా
సాక్షి, గుంటూరు : టీడీపీ నేత, శాసన సభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుటుంబం అక్రమాలకు బలైన ఓ కేబుల్ ఆపరేటర్ వారి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. కబ్జాలు, అవినీతి, అక్రమాలతో తమ కులానికే చెడ్డపేరు తెచ్చారంటూ కోటేశ్వరరావు అనే వ్యక్తి కోడెల కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు.. ఎన్సీవీ పేరుతో నరసరావుపేటలో కోటేశ్వరరావు కేబుల్ నిర్వహిస్తుండేవాడు. కోడెల తనయుడు శివరామకృష్ణ కేబుల్ వైర్లు కత్తిరించి ఎన్‌సీవీని కబ్జా చేశాడు. దీంతో ఎన్సీవీ కేబుల్ వైర్లు కోడెల ఇంటి ముందు పడేసి సోమవారం ఆందోళనకు దిగారు. ఊరు వదిలి పారిపోయే పరిస్థితికి వచ్చారంటూ శివరామకృష్ణపై విమర్శలు చేశారు. కమ్మ హాస్టల్ నిర్మాణంలోనూ భారీగా అక్రమాలు చేశారని ధ్వజమెత్తారు. ఇదిలాఉండగా.. టీఆర్ లేకుండా సుమారు 800 బైక్‌లు విక్రయించిన వ్యవహారంలో కోడెల శివరామకృష్ణపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. (చదవండి : కోడెల కుమారుడిపై కేసు) -
కేబుల్ ఆపరేటర్ ఆత్మహత్య
గుంటూరు : ‘నాది కేబుల్ వ్యాపారం. కేబుల్‌లోనే ఉన్నా... కేబుల్‌తోనే పోతా... నా చావుతోనైనా ఎంఎస్ఓలు మారుతారని కోరుకుంటున్నా. ఓఎల్‌టీలు కొనలేం. సార్.. మమ్మల్ని కనిపెట్టుకోండి. ఈ పని ఇంకో ఆపరేటర్ చేయకుండా చూసుకోండి సార్. చాలా మంది కేబుల్ మీదే బతుకుతున్నాం. ఈ నా చావు మీకు కనువిప్పు కావాలి అని కోరుకుంటున్నాను.. నా కేబుల్ ఏరియాను ఎవరైనా పెద్ద మనషులు తీసుకోని నా కుటుంబానికి న్యాయం చేయండి. అమ్మా ఈ జన్మకు ఇంతే.. నన్ను అందరూ క్షమించండి’ అంటూ గుంటూరుకు చెందిన కేబుల్ ఆపరేటర్ గిరిజాశంకర్ పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాయ్ నిబంధనల మేరకు సిటీ కేబుల్ ధరలు పెంచడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు. -
ఆపరేటర్‌ను బలిగొన్న కేబుల్ ధరల పెంపు
లక్ష్మీపురం(గుంటూరు): కేబుల్ ధరల పెంపు నిర్ణయంతో మనస్తాపం చెందిన ఓ ఆపరేటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా రెడ్డిపాలెం శివారులో ఆదివారం ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు అరండల్‌పేటకు చెందిన చామర్తి గిరిజాశంకర్ (44) 1995 నుంచి డొంకరోడ్డు వద్ద గల వసంతరాయపురం కేబుల్ ఆపరేటర్‌గా వ్యవహరిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కేబుల్ ధరల పెంపుపై గత కొన్ని రోజులుగా కేబుల్ ఆపరేటర్స్ సిటీకేబుల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేబుల్ ధరలు రూ.200 నుంచి రూ.800 వరకు పెరిగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడటంతో పాటు కేబుల్ ఆపరేటర్ల జీవితాలు రోడ్డు పాలవుతాయని ఆందోళన చెందిన గిరిజాశంకర్ ఆదివారం రెడ్డిపాలెం గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాసి ఉంచాడు. ‘నేను కేబుల్ వ్యాపారిని. నా వ్యాపారం లేకపోతే నేను లేనట్టే. నేను చాలా టెన్షన్ పడుతున్నాను నా వారికి న్యాయం చేయలేనని. నా కేబుల్ ఏరియాను ఎవరైనా పెద్ద మనుషులు తీసుకుని నా కుటుంబానికి న్యాయం చేయండి.. కేబుల్‌లోనే ఉన్నా.. కేబుల్‌తోనే పోతా.. క్షమించండి. నా కుటుంబానికి న్యాయం చేయండి. నా చావుతోనైనా ఎంఎస్ఓలు మారుతారని కోరుకుంటున్నాను.’ అని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. కాగా మృతుడు గిరిజాశంకర్‌కు భార్య పద్మ, కుమారుడు గోపీచంద్ ఉన్నారు. సిటీ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు, కార్యదర్శి శంకరరావు, శ్రీనివాసరావు, సురేష్‌లతో పాటు గుంటూరు కేబుల్ ఆపరేటర్స్ అందరూ ప్రభుత్వ సమగ్రాస్పత్రికి చేరుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు పి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సిటీకేబుల్ ట్రాయ్ నిబంధనల ప్రకారం ధరలు పెంచడంతో మూడు రోజులుగా రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నామన్నారు. తోటి ఆపరేటర్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇంత జరుగుతున్నా సిటీ కేబుల్ యాజమాన్యం కానీ, ఎంఎస్‌వోలు కాని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. సిటీకేబుల్ యాజమాన్యం ఇదే తరహాలో ఉంటే మృతుడు శంకర్‌తో పాటు జిల్లా వ్యాప్తంగా 600 మంది కేబుల్ ఆపరేటర్లకూ ఇలాంటి పరిస్థితే ఏర్పడుతుందన్నారు. కేబుల్ ఆపరేటర్లు అందరూ ఆపరేటర్ మృతికి నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి పండరీపురంలోని సిటీకేబుల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. -
వినోద భారం తగ్గేనా?
కూకట్‌పల్లిలో ఉండే శివకు కేబుల్ బిల్లు రూ.280 వచ్చింది. ‘మేం చూసేదే.. ఐదో, ఆరో చానళ్లు ఇంత ధరెందుకు? అంటే సార్ ఇది హైదరాబాద్.. ఇక్కడ అన్ని భాషలోళ్లు ఉంటరు.. మీ ఒక్కరికోసం తగ్గించలేం ’అని బదులిచ్చాడు కేబుల్ బాయ్. ఈ బాధ భరించలేక.. డీటీహెచ్ కొనుక్కున్నాడు. కానీ, అందులోనూ అదే దోపిడీ ఎంపిక చేసిన చానళ్ల పేరుతో ఖర్చు రూ.500లకు పెరిగింది.అందులోనూ తాను చూడని చానళ్లే అధికం. దీంతో దిక్కుతోచలేదు అతనికి. సాక్షి, హైదరాబాద్: కేబుల్ టీవీ, డీటీహెచ్ పేరిట ఇష్టానుసారంగా జరుగుతున్న దోపిడీకి ఇది నిదర్శనం. నిబంధనల్ని తుంగలో తొక్కి అవసరం ఉన్నా లేకున్నా.. నచ్చని చానళ్లను అంటగడుతూ.. అందినకాడికి డబ్బులు దండుకుంటున్నారు. ఇక నుంచి ఇలాంటి వినియోగదారులపై వినోద భారం తగ్గనుంది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ కొత్త నిబంధనలు అమలుకానున్నాయి. వాస్తవానికి ఇవి డిసెంబరు ఆఖరుకే అమలు కావాలి. కానీ, వివిధ వర్గాల ఆందోళనల నేపథ్యంలో అమలును ఫిబ్రవరి 1కి వాయిదా వేశారు. ట్రాయ్ కొత్త నిబంధనల ప్రకారం.. ఇష్టానుసారంగా చానళ్లకు రుసుం వసూళ్లు చేస్తామంటే కుదరదు. ఇష్టం లేని, చూడని చానళ్లకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ వసూలు చేస్తున్నారు వాస్తవానికి ట్రాయ్ నిబంధనల ప్రకారం.. కనిష్టంగా రూ.100 నుంచి గరిష్టంగా రూ.153 వసూలు చేయాలి. కానీ.. ఈ నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదు. ఎవరికి వారు ఇష్టానుసారంగా వసూలు చేస్తున్నారు. తాము చూడని చానళ్లకు కూడా వారు డబ్బు చెల్లిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 82 లక్షల మంది టీవీ సబ్స్క్రైబర్లున్నారు. వీరిలో 17 లక్షల మంది డీటీహెచ్ సబ్స్క్రైబర్లు. మీరు చూడని చానల్‌కు డబ్బులు చెల్లించనక్కర్లేదని ట్రాయ్చెబుతున్నా.. ఆ నిబంధనల్నికొన్ని శాటిలైట్ చానళ్లు పట్టించుకోవడం లేదు. వాస్తవానికి మదర్ చానల్ ఒకటి ఉంటుంది. దానికి అనుబంధంగా మరో డజను చానళ్ల వరకు ఉంటాయి. ఈ డజను చానళ్లలో ఏదో ఒకటే ఎంచుకుంటానంటే కుదరదు. ఏ ఒక్కటి చూడాలన్నా.. మొత్తం కొనుక్కోవాల్సిందే. వీటిపై ట్రాయ్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రకటనల మాటేంటి? వివిధ చానళ్లలో యాడ్ల ద్వారా ఆయా చానళ్లకు కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది. వీటిలో ఉచిత చానళ్లలో యాడ్లపై వినియోగదారులకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. ఎటొచ్చీ పెయిడ్ చానళ్ల విషయంలో అభ్యంతరాలను లేవనెత్తుతున్నారు. ఇప్పటికే చానల్ చూస్తున్నందుకు డబ్బులిస్తున్నాం కదా? అలాంటప్పుడు మళ్లీ యాడ్ల గోల ఎందుకు? అని నిలదీస్తున్నారు. ట్రాయ్ కొత్త నిబంధనల నేపథ్యంలో ఒక్కో చానల్ ధరను 400% పెంచేశాయి. వీటి ద్వారానే కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నపుడు తిరిగి ప్రకటనలు ప్రసారం చేయడం ఎందుకంటున్నారు. వినియోగదారులకు హక్కులివి! 1. ఏ పే చానల్‌కు అయినా.. గరిష్ఠంగా 19 రూపాయలు మాత్రమే వసూలు చేయాలి. కొత్త నిబంధనల ప్రకారం 100 ఉచిత చానళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. అందులో 26 దూరదర్శన్ చానళ్లే ఉంటాయి. ఈ వంద చానళ్లకీ కలిపి 130 రూపాయలు, 18% జీఎస్టీ అంటే మొత్తం రూ.153.40 మాత్రమే చెల్లించాలి. 2. ఉచిత చానళ్ల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ వినియోగదారుడిదే. వంద చానళ్ల కంటే ఎక్కువ ఉచిత చానళ్లను ఎంపిక చేసుకునే హక్కు కూడా వినియోగదారుడికి ఉంది. ఉదాహరణకు వందకు పైన ఇంకో 25 ఉచిత చానళ్లు కోరుకుంటే దానికి మరో 20 రూపాయలు ఎక్కువ బిల్లు కట్టాలి. 3. ప్రతీ చానల్ ధర వేర్వేరుగా ఉంటుంది. లేదంటే ఒకే గ్రూపునకు చెందిన చానళ్లు నాలుగైదింటికి కలిపి ఒక ధర ఇవ్వవచ్చు. 4. ప్రతీ ఆపరేటరూ తాను అందించే చానళ్ల లిస్టును వినియోగదారులకు వద్దకు తీసుకురావాలి. అందులో వినియోగదారులు నచ్చినవి ఎంపిక చేసుకుని, ఏది కావాలో టిక్ పెట్టి కింద సంతకం పెట్టాలి. 5. కేబుల్ యాక్టివేషన్ చార్జీలు 350 రూపాయలకు మించకూడదు. అన్నిటికీ బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలి. నెల నెలా కట్టే డబ్బులతో సహా. 6. మీకిచ్చే కార్డులో మొత్తం చానళ్ల పట్టిక, వాటి ధరలు, గ్రూపు చానళ్ల ధరలు, మీ ఎంపిక, నెలవారీ బిల్లు – మొత్తం ఉండాలి. 7. అన్ని రకాల నిబంధనలు ముద్రించిన కాగితం ఇవ్వాలి. అన్ని రకాల రేట్లు, రూల్స్ గురించి వివరించి చెప్పాలి. ఫిర్యాదు చేస్తే 8 గంటల్లో సర్వీసు సమస్య పరిష్కరించాలి. 8. ఏదైనా పే చానల్ ప్రసారాలు ఆగిపోతే ఆ డబ్బు వసూలు చేయకూడదు. కావాలంటే దాని బదులు అంతే ధర ఉన్న వేరే పే చానల్ ఇవ్వవచ్చు. 9. ఫిర్యాదులకు సంబంధించిన నంబర్లు ఇవ్వాలి, వెబ్ సైట్ ఏర్పాటు చేయాలి. చానళ్ల మార్పిడి రాతపూర్వకంగా ఉండాలి, 72 గంటల్లో జరగాలి. 10. నెల కంటే ఎక్కువ రోజులు చానల్ చూడకపోతే ఆ నెల బిల్లు కట్టక్కర్లేదు. కానీ ఆ విషయం 15 రోజుల ముందే ఆపరేటర్‌కి చెప్పాలి. కానీ రీ–కనెక్షన్‌కి 3 నెలల లోపు అయితే 25 రూపాయలు, మూడు నెలలు దాటితే 100 రూపాయలు కట్టాలి. ప్రస్తుత తెలుగు చానళ్లు ఆఫర్ చేస్తోన్న ధరలు(రూ.ల్లో): జెమినీ బొకే రూ.35.40, ఈటీవీ బొకే రూ.28.32, స్టార్ తెలుగు బొకే రూ.46.02, జీ ప్రైమ్ ప్యాక్ బొకే రూ.23.60, భవిష్యత్తులో అంతా ఆన్‌లైన్‌కే మొగ్గు! ఇప్పటికే ఆన్లైన్లో అమేజాన్, నెట్‌ఫ్లిక్స్, జియో తదితర సంస్థలు యాడ్లు లేకుండా వినోదాన్ని అందించే ప్యాకేజీలు అందుబాటులో ఉంచాయి. ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ప్రతీ ప్యాకేజీ భారంగా కనిపించే అవకాశాలున్న నేపథ్యంలో చాలామంది వీటివైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వీటిలో నచ్చిన కార్యక్రమం చూసుకోవచ్చు. పైగా మొబైల్‌కు, టీవీకి, కంప్యూటర్, ట్యాబ్ ఎక్కడైనా ఎపుడైనా చూసుకోవచ్చు. పైగా వీటి సబ్స్క్రిప్షన్ ఏడాదికి రూ.1000 లోపే కావడం గమనార్హం. ట్రాయ్ నిబంధనల్లో ప్రైవేటు ప్యాకేజీల భారంగా భావించినవారంతా వీటివైపు మొగ్గుచూపే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఎలాగూ.. న్యూస్ చానళ్లు ఉచితంగా వస్తున్నాయి. పలు టీవీ సీరియళ్లు యూట్యూబ్ ఇతర యాప్‌లో అందుబాటులో ఉంటున్నాయి. -
పలు జిల్లాలో గంటపాటు కేబుల్ ప్రసారాల నిలిపివేత
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ఉదయం గంటపాటు కేబుల్ ప్రసారాలు నిలిపివేసినట్టు ఏపీ మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ తెలిపింది. ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లపై విజయవాడ జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం విజయ కృష్ణన్ అధికారులతో జరిగిన ఫోన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లపై పరుష పదజాలన్ని వాడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఫైబర్ గ్రిడ్‌ను ప్రమోట్ చేయడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, విజయ కృష్ణన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందించకపోవడంపై కేబుల్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు విధాలుగా తమ ఆందోళన చేపడుతున్నారు. జేసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆత్మగౌరం చాటుకున్నందుకు ధన్యవాదాలు.. కేబుల్ ప్రసారాలు నిలిపివేసినందుకు ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు ఏపీ ఎమ్మెస్వోల సంఘం ధన్యవాదాలు తెలిపింది. కేబుల్ ఆపరేటర్లు ఈ నిర్ణయం తీసుకుని ఆత్మగౌరం చాటుకున్నారని అభిప్రాయపడింది. అత్యంత అవమానకరంగా తిట్టిన, బెదిరించిన ఐఏఎస్ అధికారి వైఖరికి సరైన రీతిలో నిరసన తెలిపినట్టు వెల్లడించారు. -
బుల్లి తెర భారం
వరంగల్: ఇకపై ప్రేక్షకులకు బుల్లితెర వీక్షణం మరింత భారం కానుంది. నేరుగా ఇంటింటికీ ప్రసారాలు (డీటీహెచ్) అందించే సంస్థలకు మాదిరిగా పే చానళ్లకు సంబంధించి అదనపు చార్జీలను కేబుల్ టీవీ నిర్వాహకులకు చెల్లించాలని టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సామాన్యులపై భారం పడనుంది. ఇప్పటివరకు కేబుల్ టీవీ వినియోగదారులు వారి ప్రాంతాల్లోని ఆపరేటర్లు నిర్ణయించిన ప్రకారం నెలనెలా బిల్లులు చెల్లించేవారు. వారు ప్రసారం చేసే అన్ని చానళ్లను వీక్షించే అవకాశం ఉండేది. డిజిటల్ ప్రసారాలు, సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేసినప్పటికీ బిల్లుల చెల్లింపుల్లో పెద్దగా తేడా రాలేదు. ప్రసారాలు డిజిటల్‌గా మారడంతో చిత్రం, మాటల్లో స్పష్టత పెరిగింది. మండల కేంద్రాలు, పట్టణాలు, నగరాల్లో 250 నుంచి 400 చానళ్ల వరకు కేబుల్ ఆపరేటర్లు.. ఎంఎస్ఓల సాయంతో వినియోగదారులకు అందజేస్తున్నారు. ఉచితంగా లభించే వినోదం, వార్తలు, సినిమాలు, వంట ప్రోగ్రాం, స్పోర్ట్స్ చానళ్లు హిందీ, ఇంగ్లిష్, తమిళం, మళయాలం, ఉర్దూ భాషల్లో ప్రసారం అవుతున్నాయి. నగరాల్లో మాస్టర్ కంట్రోల్ రూం ఆపరేటర్లు చేసే ప్రసారాల్లో స్థానిక ఆపరేటర్లు తన ప్రాంత వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా ప్రసారాలను అందిస్తున్నారు. సెట్‌టాప్ బాక్స్‌లు ఏర్పాటు చేశాక, ప్రధానమైన మాస్టర్ ఆపరేటర్ల పరిధిలో ఎంత మంది వినియోగదారులు టీవీప్రసారాలను తిలకిస్తున్నారనే లెక్క తేలింది. తదనుగుణంగా ఆదాయం ఎంఎస్ఓలకు పెరిగింది. నెలరోజుల పాటు టీవీ ప్రసారాలు తిలకించిన వినియోగదారుడు బిల్లులు చెల్లించే పద్ధతి ఇప్పుడు అమలులో ఉంది. డీటీహెచ్ ప్రసార సంస్థలు : ప్రస్తుతం ఎంఎస్ఓలు డిజిటల్ ప్రసారాలను వినియోగదారులకు అందజేస్తున్నారు. వీటిలో చానళ్లకు విడివిడిగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ప్రసారాల పరంగా క్రీడలు, సినిమాలు, ఇంగ్లీ్లషు చానళ్లకు ప్యాకేజీల వారీగా చెల్లించాలి. అప్పుడే ఆయా చానళ్ల ప్రసారాలు జరిగేవి. చానళ్లకు ఒక రేటు, ప్యాకేజీలకు ఒక రేటన్లుండేవి. ఇవి పొందేందుకు నెలవారీగా, మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది సబ్స్క్రిప్షన్లను రీచార్జి చేసుకుంటేనే ప్రసారాలు చూసే వీలుంది. ఆరునెలలు, ఏడాది కోసం ఒకేసారి రీచార్జి చేసుకుంటే కొంత రాయితీలను డీటీహెచ్ కంపెనీలు అందిస్తున్నాయి. నూతన విధానం ఇలా.. కేబుల్ టీవీ ఆపరేటర్లకు వినియోగదారులు ప్రీపెయిడ్ పద్ధతిలో ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. ట్రాయ్ నిబంధనల ప్రకారం నిర్ధారిత రుసుముకు ఆపరేటర్లు 100 ఉచిత చానళ్లను వినియోగదారులకు అందించాల్సి ఉంటుంది. దీనికి కేబుల్ ఆపరేటర్‌కు రూ.130తో పాటు జీఎస్టీ చెల్లించాలి. పే చానళ్లు వీక్షించాలంటే ఆయా కంపెనీలకు ప్యాకేజీల వారీగా ముందుగానే చెల్లింపులు చేయాలి. ప్రస్తుతం కేబుల్ ఆపరేటర్లు అందిస్తున్న అన్ని చానళ్లు చూడాలంటే నెలవారీ బిల్లులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. తెలుగు సీరియళ్లు, సినిమాలు, క్రీడా చానళ్లు చూడాలంటే ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే ఎక్కువ మొత్తం (కనీసం రూ.350) చెల్లించక తప్పదని ఎంఎస్ఓలు చెబుతున్నారు. దీంతో సగటు రూ.150 నుంచి రూ.250 వరకు అదనపు భారం పడే అవకాశం ఉంది. గడువు ఈ నెల 29 : ఒక ప్యాకేజీలో చేరాలంటే చానల్‌కు గరిష్టంగా రూ.19 మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. ఇంతకు మించి చానల్ ధర నిర్ణయించుకుంటే ఏ ప్యాకేజీలో భాగం అయ్యే వీలుండదు. ఆ చానల్ ప్రసారం చేసే ప్రసారాల(సొంత కంటెంట్)పై విశ్వాసం ఉంటేనే ప్రత్యేక ధర నిర్ణయించుకునే వీలుంటుంది. తెలుగు చానళ్లను చూస్తే వార్తా చానళ్లు ఉచితంగానే లభిస్తుండగా పలు చానళ్ల ధర రూ.17, రూ.19గా నిర్ణయించారు. వినియోగదారులు కోరుకున్న చానళ్లు మాత్రమే చూడగలగడం నూతన విధానం ప్రత్యేకతగా ఎంఎస్ఓలు తెలుపుతున్నారు. నూతన విధానానికి ఈ నెల 29వ తేదీ వరకు సిద్ధం కావాల్సి ఉంది. జిల్లాలో సుమారు 300 చానళ్లను ప్రసారం చేస్తున్నా నెలకు రూ.150 నుంచి 220 వరకు వసూలు చేస్తున్నారు. ఇకపై ఇంట్లో ఎవరెవరూ ఏ చానల్‌ను చూడాలో అన్న విషయాలను చర్చించి ఆ ప్యాకేజీలను పొందాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. -
నిలిచిన కేబుల్ ప్రసారాలు
కేబుల్ ఆపరేటర్ హత్య ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బీరంగూడలో కేబుల్ ఆపరేటర్ రమేశ్ హత్యను నిరసిస్తూ కేబుల్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. సోమవారం సాయంత్రం ఆరు నుండి ఎనిమిది గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రసారాలను నిలిపివేసి నిరసన తెలిపారు. కొందరు మాఫియాగా ఏర్పడి ఆపరేటర్లపై దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ ఆపరేటర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజుగౌడ్, గౌరవాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు లింగాల హరిగౌడ్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తమ నిరసన విజయవంతమైందని తెలిపారు. -
‘షో’లు చెల్లవ్!
కేబుల్ నిర్వాహకుల నుంచి వినోద పన్ను వసూలుకు సిద్ధం కొత్త ఆదాయ మార్గాల అన్వేషణలో జీహెచ్ఎంసీ థియేటర్ల ఆక్యుపెన్సీపై దృష్టి సంప్రదింపులతో వివాదాల పరిష్కారం సిటీబ్యూరో: మీరు కేబుల్ ఆపరేటరా? కొన్నేళ్లుగా జీహెచ్ఎంసీకి వినోదపు పన్ను చెల్లించడం లేదా? మీరు ఎన్నాళ్ల నుంచి పన్ను చెల్లించడం లేదో ఓ అంచనాకు రండి. అందుక వసరమైన మొత్తాన్ని సిద్ధం చేసుకోండి. ఇదంతా మేం చెబుతున్నది కాదు. ఆదాయం పెంచుకునే క్రమంలో జీహెచ్ఎంసీ ఇప్పుడు మీపై దృష్టి సారించింది. సినిమా థియేటర్ల నుంచీ భారీగా వసూలుకు రంగం సిద్ధం చేస్తోంది. మరో మూడు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో వివిధ పన్నుల రూపంలో భారీగా ఆదాయం పెంచుకునే పనిలో పడింది. ఆస్తిపన్ను, ట్రేడ్‌లెసైన్స్ ఫీజులు, ప్రకటనల పన్నుల వంటి వాటి ద్వారా ఈ మొత్తాన్ని సమకూర్చుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగింది. దీంతో పాటు కొంతకాలంగా వివిధ వర్గాల నుంచి రావలసిన బకాయిలనూ రాబట్టాలని నిర్ణయించింది. థియేటర్లు...కేబుల్ ఆపరేటర్లపై దృష్టి కొత్త ఆదాయ మార్గాలను వెదికే క్రమంలో గత కొంత కాలంగా ‘వదిలేసిన’ వినోద పన్నుపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. సినిమా థియేటర్ల నుంచి టిక్కెట్ల ధరలో 20 శాతం వినోదపు పన్నుగా కార్పొరేషన్కురావలసి ఉంది. చాలా థియేటర్ల యాజమాన్యాలు సరైన వివరాలివ్వకుండా.. తక్కువ ఆక్యుపెన్సీ చూపుతూ ఈ పన్నును ఎగ్గొడుతున్నాయి. దీని ద్వారా దాదాపు రూ.220 కోట్లు జీహెచ్ఎంసీ ఖజానాకు చేరాలి. ప్రస్తుతం రూ.20 కోట్లే వస్తోంది. స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ వీటి లెక్క తేల్చే పనిలో పడ్డారు. థియేటర్లలో షో ప్రారంభమయ్యాక ఎన్ని టిక్కెట్లు అమ్ముడుపోయాయో తెలుసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు కేబుల్ ఆపరేటర్ల నుంచి కూడా వినోద పన్ను రావడం లేదని గుర్తించారు. జీహెచ్ఎంసీ కూడా ఈ అంశాన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక్కో కనెక్షన్‌కు ఏడాదికి రూ.50 చొప్పున పన్ను విధించినా సుమారు రూ.6 కోట్లు రాగలవని అంచనాకు వచ్చారు. ఈ మొత్తం వసూలుకూ సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు జీహెచ్ఎంసీకి రావాల్సిన ఇతరత్రా పన్నులేమేం ఉన్నాయో తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగాఐలాల పరిధిలోని భవనాల నుంచి రావాల్సిన ఆస్తిపన్ను వాటా వంటి వాటిపైనా దృష్టి సారించారు. వీటన్నింటితో పాటు ఇప్పటి వరకు లెక్కించని భవనాలను ఆస్తిపన్ను పరిధిలోకి తేవడంతో పాటు నివాస గృహాల కేటగిరీలో ఆస్తిపన్ను చెల్లిస్తూ... వాణిజ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న వారి వివరాలు సేకరించే పనిని ప్రారంభించారు. దీనిపై సర్వే చేస్తున్నారు. వీటితో పాటు ఆస్తిపన్నుకు సంబంధించిన కోర్టు వివాదాలను వీలైనంత మేరకు సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునే చర్యలకు సిద్ధమవుతున్నారు. సర్కిళ్ల వారీగా వివాదాల వివరాలు సేకరించి, సంబంధిత వ్యక్తులతో సంప్రదింపులకు యోచిస్తున్నారు. కోర్టు వివాదాల్లోని దాదాపు 760 కేసుల ద్వారా జీహెచ్ఎంసీకి రూ.90 కోట్లు వచ్చే అవకాశముందని అంచనా వేశారు. ఈ వివాదాలు అబిడ్స్, ఖైరతాబాద్, కూకట్పల్లి, సికింద్రాబాద్ సర్కిళ్లలో అధికంగా ఉన్నట్లు గుర్తించారు. సర్కిళ్ల వారీగా వివాదాలు... కాప్రా-3, ఉప్పల్-4, ఎల్బీనగర్-35, చార్మినార్(1)-19, చార్మినార్(2)-25, రాజేంద్రనగర్-23, ఖైరతాబాద్(1)-47, అబిడ్స్(1)-157, అబిడ్స్(2)-65, ఖైరతాబాద్(2)-142, శేరిలింగంపల్లి(1)-11, కూకట్పల్లి-82, కుత్బుల్లాపూర్-18, అల్వాల్-30, మల్కాజిగిరి-23, సికింద్రాబాద్-73. శేరిలింగంపల్లి(2), ఆర్సీపురం-పటాన్చెరు సర్కిళ్లలో ఎలాంటి వివాదాలు లేవు. ఇంకా జీహెచ్ఎంసీకి రావాల్సిన వృత్తి పన్ను వాటా, వాహనాల పన్ను వాటాపైనా దృష్టి సారించారు. వీలైనన్ని మార్గాల ద్వారా భారీ ఆదాయాన్ని సమకూర్చుకోవడం పైనే జీహెచ్ఎంసీ గురి పెట్టింది. -
స్నానం చేస్తుండగా రహస్య చిత్రీకరణ
= కేబుల్ ఆపరేటర్‌ను పట్టుకున్న స్థానికులు = నిందితుడిపై నిర్భయ చట్టం కింద కేసు బంజారాహిల్స్, న్యూస్‌లైన్: బాత్రూమ్లో వెబ్‌కెమెరా బిగించి మహిళలు స్నానం చేయడాన్ని దొంగచాటుగా చూస్తూ.. తన కంప్యూటర్లో బంధిస్తున్న ఓ నీచుడిని బస్తీవాసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్సై ఎ.అన్వేష్‌రెడ్డి కథనం ప్రకారం...చిత్తూరు జిల్లా తిరుపతి పట్టణానికి చెందిన తిరునగరి రవిశంకర్ ప్రసాద్ (40) రెండేళ్లుగా బంజారాహిల్స్ రోడ్డునెం.10లోని సింగాడికుంట బస్తీతో పాటు పరిసర ప్రాంతాల్లో కేబుల్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. పది రోజుల క్రితం సింగాడిబస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకొని అందులో కేబుల్‌కు సంబంధించిన కార్యాలయాన్ని తెరిచి.. అక్కడ ఓ కంప్యూటర్ను ఏర్పాటు చేశాడు. ఇదే ఇంట్లో ఉన్న మరో రెండు గదుల్లో తల్లీకూతురుతో పాటు ఇంకో జంట అద్దెకుంటున్నారు. ఈ మూ డు గదులకు కలిపి ఒకే బాత్రూం ఉంది. మూడు రోజుల క్రితం రవిశంకర్ బాత్రూంలో ఓ మూలకు కెమెరా బిగించాడు. వైర్ ద్వారా తన గదిలో ఉన్న కంప్యూటర్‌కు కనెక్షన్ ఇచ్చి మహిళలు స్నానం చేస్తుండగా కెమెరాలో బంధించడమే కాకుండా కంప్యూటర్లో చూస్తున్నాడు. పక్కగదిలో ఉండే యువతి (18) సాయంత్రం విధులు ముగించుకొని ఇంటికి వచ్చి.. ఆదివారం రాత్రి ఏడు గంటలకు స్నానం చేసేందుకు బాత్రూంకు వెళ్లింది. గది మూలన లైట్లు వెలుగుతూ ఆరుతూ ఓ పరికరం కనిపించడంతో ఆమె కంగారుపడింది. ఆ పరికరాన్ని బయటకు లాగి చూడగా కెమెరా అని తేలింది. మరింత లోతుగా పరిశీలించగా కెమెరాకు అమర్చిన వైర్ తమ పక్కనే అద్దెకుంటున్న కేబుల్ ఆపరేటర్ రవిశంకర్ ఇంట్లోకి అనుసంధానమై ఉంది. ఈ విషయాన్ని తన తల్లితో పాటు చుట్టుపక్కల వారికి తెలియజేసింది. వెంటనే వారంతా రవిశంకర్ గది తలుపులు తెరిచి చూడగా కంప్యూటర్లో యువతి నగ్న దృశ్యాలను చూస్తూ దొరికిపోయాడు. స్థానికులు అతడ్ని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354(సీ) నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు.