
గుంటూరు : ‘నాది కేబుల్ వ్యాపారం. కేబుల్‌లోనే ఉన్నా... కేబుల్‌తోనే పోతా... నా చావుతోనైనా ఎంఎస్‌ఓలు మారుతారని కోరుకుంటున్నా. ఓఎల్‌టీలు కొనలేం. సార్.. మమ్మల్ని కనిపెట్టుకోండి. ఈ పని ఇంకో ఆపరేటర్ చేయకుండా చూసుకోండి సార్. చాలా మంది కేబుల్ మీదే బతుకుతున్నాం. ఈ నా చావు మీకు కనువిప్పు కావాలి అని కోరుకుంటున్నాను.. నా కేబుల్ ఏరియాను ఎవరైనా పెద్ద మనషులు తీసుకోని నా కుటుంబానికి న్యాయం చేయండి. అమ్మా ఈ జన్మకు ఇంతే.. నన్ను అందరూ క్షమించండి’ అంటూ గుంటూరుకు చెందిన కేబుల్ ఆపరేటర్ గిరిజాశంకర్ పురుగు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. ట్రాయ్ నిబంధనల మేరకు సిటీ కేబుల్ ధరలు పెంచడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment