స్వైన్‌ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన | VIJAYASAI REDDY CONCERN OVER INCREASE IN SWINE FLU DEATHS | Sakshi
Sakshi News home page

స్వైన్‌ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన

Published Tue, Feb 7 2017 4:49 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM

స్వైన్‌ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన - Sakshi

స్వైన్‌ ఫ్లూపై విజయసాయిరెడ్డి ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధి విస్తరిస్తుండటంపై వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం జీరోఅవర్‌లో ఆయన మాట్లాడారు. ఏపీలో 2016 సంవత్సరంలో 12 మంది స్వైన్‌ఫ్లూ వైరస్‌ సోకగా ఐదుగురు చనిపోయారని తెలిపారు.

అదేవిధంగా ఈ ఏడాది జనవరిలో 26 మంది స్వైన్‌ఫ్లూ బాధితులకు గాను ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. స్వైన్‌ఫ్లూ వ్యాప్తిని అరికట్టటంలో యంత్రాంగం విఫలమయిందని ఆరోపించారు. వ్యాధి తీవ్రతను గుర్తించలేకపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని ఆరోగ్య కుటుంబసంక్షేమ శాఖ మంత్రిని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement