తెరచాటున యూనియన్ నాయకులు?
పాత హద్దులు మాయం.. కొత్తవి ఏర్పాటు
భీమారం : సొంతింటి కలను నిజం చేసుకోవాలన్న ఆశతో దాచుకున్న సొమ్ముతో జర్నలిస్టులు కొనుగో లు చేసి భూమి కబ్జాకు గురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్ పట్టాదారుడి నుంచి ఖరీదు చేసిన ఈ భూమి కబ్జాకు యత్నాలు జరుగుతుండడంతో జర్నలిస్టుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీని వెనుక కొందరు యూనియన్ నాయకుల హస్తం ఉన్నట్లు తెలుస్తుండ డం వారి ఆందోళనను రెట్టింపు చేస్తోంది. భీమారం శివారులోని(చింతగట్టు క్యాంప్ సమీపం) 2002లో జర్నలిస్టులు సుమారు ఏడు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. వివిధ దినపత్రికల్లో పనిచేస్తున్న విలేకరులు(కంట్రిబ్యూటర్, స్టాపర్లు, సబ్‌ఎడిటర్లు) 171 మంది వీరిలో ఉండగా.. 2006లో ఒక్కొక్కరికి 150గజాల చొప్పున కేటాయించారు. తాజాగా ఇం దులో రెండున్నర ఎకరాల భూమికి సంబంధించిన హద్దులు తొలగింపునకు గురయ్యాయి. దీంతో విలేకరులు ఆరాతీయగా దీని వెనుక శంకర్‌రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్లు తేలింది. ఆయనతో ఫోన్‌లో మాట్లాడగా... యూనియన్‌కు చెందిన ఇద్దరు పేర్లను ప్రస్తావిం చాడు.
ఆ నాయకులకు సమాచారం ఇచ్చే భూమిని చదును చేశానని ఆయన చెప్పడంతో విలేకరులు కంగుతిన్నారు. అయితే, స్థలాన్ని చదును చేయడం పక్కన పెడితే.. పాత హద్దులు తొలగించి కొత్తగా రాళ్లు పాతించడం గమనార్హం. అయితే, యూనియన్ నేతల పేర్లను శంకర్‌రెడ్డి చెబుతుండడంతో... వారు ఈయనకు సహకరించారా, వెనుక ఉన్న భూమిలో జర్నలిస్టుల భూమి కలుపుకునేందుకు యత్నాలు జరుగుతున్నాయా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. హద్దులు తొలగించారన్న సమాచారంతో శనివారం పెద్దసంఖ్యలో విలేకరులు పరిశీలించారు. ఈ విషయంలో శంకర్‌రెడ్డిపై వారు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేయాలని నిర్ణయించుకున్నారు.