ఏం జరుగుతుందో?
ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న మావోలు
ఆదివాసీ గూడేలపై పోలీసుల డేగ కన్ను
అధికారపార్టీ నేతల్లో టెన్షన్...టెన్షన్
భద్రాచలం : తెలంగాణ- ఛత్తీస్‌గఢ్- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందోననే ఆందోళన సర్వత్రా నెలకొంది. చర్ల సమీపంలోని బొట్టెంతోగు అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఎనిమిది మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. మృతుల్లో ఇద్దరు పొరుగునే ఉన్న వరంగల్ జిల్లాకు
చెందిన వారు కాగా, మడకం బండి భద్రాచలం పట్టణానికి సమీపంలోని గొల్లగుప్ప గ్రామానికి చెందిన వ్యక్తి. ఎన్‌కౌంటర్‌లో తప్పించుకున్న మావోరుుస్టు అగ్రనేతలు, ఇతర దళసభ్యులు, మిలీషియూ సభ్యులు తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోనే ఎక్కువగా సంచరించే అవకాశముందని భావిస్తున్న పోలీస్‌బలగాలు వారిని పట్టుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారుు. ఇదే క్రమంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు మావోరుుస్టులు సైతం ప్రతివ్యూహాలు రచించే అవకాశాలు లేకపోలేదని ఈ ప్రాంతవాసులు అంటున్నారు. భారీ ఎన్‌కౌంటర్లు జరిగిన తర్వాత అనేక సందర్భాల్లో మావోరుుస్టులు కోవర్టు ఆపరేషన్ పేరిట అనేకమందిని హతమార్చిన ఘటనలను ఉదహరిస్తున్నారు. మావోరుుస్టులు విధ్వంసకర చర్యలకు పాల్పడే అవకాశముందన్న నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ఆదివాసీ గూడేల్లో ఆందోళన నెలకొంది.
అధికార పార్టీల నేతల్లో గుబులు
ఎన్‌కౌంటర్ పరిణామాల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ నేతలకు గుబులు పట్టుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఎన్‌కౌంటర్ జరిగినా, తెలంగాణ పోలీసుల పాత్ర ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రభావంతో గూడేల్లో టీఆర్‌ఎస్ నేతలు తిరిగే పరిస్థితి ఉండదని, ప్రధానంగా భద్రాచలం డివిజన్‌లో ఉండే నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మానె రామకృష్ణతోపాటు డివిజన్‌లోని పలు మండలాల ఆ పార్టీ బాధ్యులను ఇటీవల మావోయిస్టులు కిడ్నాప్ చేసిన విషయం విదితమే. తాజా పరిణామాలతో మళ్లీ అటువంటి ఘటనలు మళ్లీ పునరావృతమైతే ఎలా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల్లో అధికార పార్టీ నాయకుల ప్రమేయం ఉందనే ప్రచారం కూడా సాగుతుండటంతో మావోయిస్టులు ఎవరిని టార్గెట్ చేస్తారోననే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
పోలీసుల డేగకన్ను
ఎన్‌కౌంటర్ తర్వాత జరిగే పరిణామాలపై పోలీసులు నిశితంగా పరిశీలన చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని మావోయిస్టులను ఏరివేయాలని లక్ష్యంతో మూడు రాష్ట్రాల పోలీసులు జాయింట్ ఆపరేషన్‌కు సిద్ధమయ్యారు. మావోయిస్టులకు కొరియర్‌గా వ్యవహరిస్తున్న వారిపై దృష్టి సారించారు. సరిహద్దుల్లో ఉన్న గిరిజనగూడేలపై డేగకన్ను వేసిన పోలీసులు ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ మావోయిస్టుల కదలికలపై ఆరా తీస్తున్నారు.