షేర్ ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుడి నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన ఇద్దరు మహిళలకు ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి.సాయిరామ్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం
బంగారం కాజేసిన మహిళలకు జైలు
Jun 14 2017 12:26 AM | Updated on Aug 20 2018 4:44 PM
కాకినాడ లీగల్ (కాకినాడ సిటీ) :
షేర్ ఆటోలో ప్రయాణిస్తూ తోటి ప్రయాణికుడి నుంచి బంగారు ఆభరణాలు కాజేసిన ఇద్దరు మహిళలకు ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ కాకినాడ నాలుగో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పి.సాయిరామ్ మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం కాకినాడ ఇంద్రపాలేనికి చెందిన జయంతి సుబ్బారావు ఆటోలో ప్రయాణిస్తుండగా అతడి బ్యాగ్‌లోని రూ.6.70 లక్షల విలువైన బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. డీఎస్పీ పిట్టా సోమశేఖర్ ఈ కేసును దర్యాప్తు చేశారు. ఫిర్యాదుదారుడితోపాటు గోకవరానికి చెందిన హంసబర్గుల కోటమ్మ, మర్రి సుభద్ర నిందితులుగా గుర్తించారు. కోర్టు విచారణలో వీరి నేరం రుజువైంది. సీనియర్ ఏపీపీ ఎంవీఎస్‌ఎస్ ప్రకాశరావు ప్రాసిక్యూషన్ నిర్వహించారు.
Advertisement
Advertisement