బంగారాన్ని తరలించిన జీన్స్ ప్యాంట్
చెన్నై, అన్నానగర్: తిరుచ్చి విమానాశ్రయంలో గురువారం రూ.22.50 లక్షల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి గురువారం ఓ ప్రైవేట్ విమానం తిరుచ్చి విమానాశ్రయానికి వచ్చింది. ఆ విమానంలో వచ్చిన రామనాథపురానికి చెందిన గణేషన్ లగేజీను అధికారులు తనిఖీ చేయగా 190 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు తెలిసింది. ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.6.15లక్షల.
అలాగే దుబాయి నుంచి గురువారం సాయంత్రం తిరుచ్చికి ఓ విమానం వచ్చింది. అందులో వచ్చిన ప్రయాణికుల లగేజీని అధికారులు పరిశీలన చేసినప్పుడు కేరళకి చెందిన పెరోస్ తాను ధరించిన జీన్స్ ప్యాంట్‌లో 540 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తెచ్చినట్లు తెలిసింది. అతని వద్ద రూ.16.50 లక్షల విలువైన బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరి వద్ద మొత్తం రూ.22.65 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. అధికారులు నిందితులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment