ఎల్‌ఈడీ లైట్లలో గోల్డ్‌ స్మగ్లింగ్‌..అరెస్ట్‌ | gold smuggling in LED Lights and arrested in shamshabad airport two kg gold recovered | Sakshi
Sakshi News home page

ఎల్‌ఈడీ లైట్లలో గోల్డ్‌ స్మగ్లింగ్‌..అరెస్ట్‌

Published Sun, Feb 12 2017 12:23 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

ఎల్‌ఈడీ లైట్లలో గోల్డ్‌ స్మగ్లింగ్‌..అరెస్ట్‌ - Sakshi

ఎల్‌ఈడీ లైట్లలో గోల్డ్‌ స్మగ్లింగ్‌..అరెస్ట్‌

శంషాబాద్‌ : బంగారం అక్రమ రవాణాకు స్మగ్లర్లు సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఎల్‌ఈడీ లైట్లలో బంగారాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

సింగపూర్‌ నుంచి టైగర్‌ ఎయిర్‌వేస్‌ (టీఆర్‌2624) ఫ్లైట్‌లో ఆదివారం ఉదయం రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ వ్యక్తిని అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అతని నుంచి పెద్ద ఎత్తున బంగారం స్వాధీనం చేసుకున్నారు. బంగారం బిస్కె‍ట్లను ఎల్‌ఈడీ లైట్లలో అమర్చడంతో పాటు శరీర భాగాల్లో అమర్చుకుని స్మగ్లింగ్‌కు పాల్పడ్డాడు. అతని వద్ద నుంచి 2 కిలోల బంగారం,, రూ. 59.10 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌ఈడీ లైట్ల లోపల 8, శరీర భాగాల్లో 12 బంగారు బిస్కెట్లను గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement