సాక్షి, కొచ్చి: దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన కేరళ బంగారు అక్రమ రవాణా కేసులో మరో సంచలన విషయం వెలుగు చూసింది. బంగారం స్మగ్లింగ్ కేసులో కీలక నిందితురాలు స్వప్నసురేష్‌తో పాటు సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి ఎం శివశంకర్ మూడు సార్లు గల్ఫ్ దేశాలు వెళ్లినట్టు దర్యాప్తు సంస్థ విచారణలో తేలింది. పీఎంఎల్‌ఎ (మనీలాండరింగ్ నిరోధక చట్టం) ప్రత్యేక కోర్టు ముందు ఈడీకి దీనికి సంబంధించిన వివరాలను సమర్పించింది. (కేరళ గోల్డ్ స్కామ్: కీలక విషయాలు వెలుగులోకి)
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ను ప్రశ్నించడాన్ని ప్రస్తావించిన ఈడీ 2017- 2018 మధ్య నిందితులు మూడుసార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లారని ఈడీ తెలిపింది. ఏప్రిల్ 2017లో, ఏప్రిల్ 2018 లో, స్వప్న ఓమన్ వెళ్లి దుబాయ్ పర్యటనలో ఉన్న శివశంకర్ ను కలిసిందని, వారిద్దరూ కలిసి భారతదేశానికి తిరిగి వచ్చారని ఈడీ వాదించింది. తిరిగి వరద బాధితుల సహాయార్ధం వెళ్లినపుడు కూడా మరోసారి (అక్టోబర్ 2018లో) సురేష్, శివశంకర్ కలిసి యుఏఈకి వెళ్లి, తిరిగి వచ్చారని తమ విచారణలో తెలిందని చెప్పింది. అలాగే శివశంకర్ సూచనల మేరకు జాయింట్ బ్యాంక్ లాకర్‌లో దీనికి సంబంధించిన డబ్బులను స్వప్న సురేష్ దాచిపెట్టినట్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో నిందితుల బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించి ఈ అంశాలపై లోతైన దర్యాప్తు జరపాలని కోరింది. స్వప్న, సరిత్, సందీప్ నాయర్ల జ్యుడీషియల్ రిమాండ్ కోరుతూ ఈడీ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆగస్టు 26 వరకు కోర్టు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశిస్తూ ఉత్తర్వులిచ్చింది..
కాగా బంగారం స్మగ్లింగ్ కేసులో నిందితురాలు స్వప్న సురేష్‌ను నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) జూలై 11న అరెస్టు చేసింది. గత వారం, ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు , అదనపు చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్, ఈ ముగ్గురి బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఎన్‌ఐఏ అదుపులో ఉన్నప్పుడు అధికారికంగా అరెస్టు చేసిన ఈడీ దర్యాప్తు మొదలు పెట్టింది. అలాగే శివశంకర్‌ను రెండోసారి శనివారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment