![Saudi Man Arrested At Delhi Airport For Allegedly Smuggling Gold - Sakshi](/styles/webp/s3/article_images/2019/02/19/gold.jpg.webp?itok=SEpbEwlB)
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: అక్రమంగా ఇండియాలోకి బంగారం తీసుకువచ్చినందుకు గానూ ఓ సౌదీ దేశీయుడిని ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.53 లక్షల విలువ చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సౌదీ అరేబియాలోని డమ్మమ్ నుంచి వచ్చినట్లు గుర్తించారు.
అతన్ని కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయగా 15 బంగారు కడ్డీలు బయటపడినట్లు, వాటి బరువు 1.6 కేజీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు ఓ స్టేట్‌మెంట్‌లో తెలియజేశారు. నిందితుడు బంగారు కడ్డీలను ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి తన నడుముకు కట్టుకున్నట్లు వెల్లడించారు. నిందితుడి దగ్గర నుంచి బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు
Comments
Please login to add a commentAdd a comment