
బంగారు బిస్కెట్లతో పట్టుబడ్డ వ్యక్తి
నిజామాబాద్ : నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో భారీ సొత్తుతో అనుమానాస్పదంగా వెళ్తున్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 100 గ్రాముల బరువున్న ఆరు బంగారు బిస్కెట్లు, 60 గ్రాముల నెక్లెస్, అలాగే 22 వెండి బిస్కెట్లతోపాటు రూ.57,300 నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిజామాబాద్‌కు చెందిన పడాల సురేష్ గౌడ్ హైదరాబాద్ నుంచి ఓ రైలులో నిజామాబాద్‌కు రాగా.. అనుమానాస్పదంగా అనిపించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దీంతో భారీగా సొత్తు బయటపడింది. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా.