అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తూ ఖాన్ మహమ్మద్ ఆరిఫ్ అనే ఎయిర్ ఇండియా ఉద్యోగి బుధవారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డాడు.
ముంబై: అక్రమంగా బంగారు బిస్కెట్లను తరలిస్తూ ఖాన్ మహమ్మద్ ఆరిఫ్ అనే ఎయిర్ ఇండియా ఉద్యోగి బుధవారం ముంబై విమానాశ్రయంలో పట్టుబడ్డాడు. టెర్మినల్–2లోని లిఫ్ట్ ప్రాంతంలో ఉదయం గస్తీ కాస్తున్న ఓ సీఐఎస్‌ఎఫ్ జవాన్ ఆరిఫ్‌పై అనుమానం వచ్చి అడ్డగించడంతో అసలు విషయం బయట పడింది. సెల్‌ఫోన్‌లోని బ్యాటరీ స్థానంలో 4 బంగారు బిస్కెట్లను తరలి స్తుండగా పట్టుకున్నామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఆరిఫ్‌ను అరెస్ట్ చేసి కస్టమ్స్ అధికారులకు అప్పగించామని ఆయన వెల్లడించారు. దుబాయికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇచ్చాడని ఆరిఫ్ తన నేరాన్ని అంగీకరించాడు.