సాక్షి, వైఎస్సార్ కడప : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజుల వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తమ స్వగృహంలో పార్టీ నాయకుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా బీసీ బాలికల హాస్టల్లో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో పార్టీ నాయకుడు వెలుగోటి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. మున్సిపల్ మాజీ ఛైర్మన్ రుక్మిణీ దేవి, షర్మిలమ్మ జీసస్ ఛార్టిస్ లో అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి మండల ఇంచార్జి శివప్రకాశ్ రెడ్డి, పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రాజంపేట: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన సందర్భంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయం వరకు రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి దంపతులు పాదయాత్ర చేపట్టారు. అలాగే నందలూరు సౌమ్యనాధ స్వామి ఆలయంలో ఆకేపాటి అమరనాథ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేశారు.
కమలాపురం : అనాధ శరణాలయంలోజిల్లా కార్యదర్శి సుమిత్రా రాజశేఖర్ రెడ్డి సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అనాధ పిల్లలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పార్టీ పంచారు. ఈ కార్యక్రమంలో సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడప : నగరంలోని వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయంలో భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యువజన విభాగం నాయకుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎస్సీ సెల్ నేత త్యాగరాజు ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. యువజన విభాగం నాయకుడు చల్లా రాజశేఖర్ నేతృత్వంలో పేదలకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార‍్యక్రమానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ చల్ల మధుసూదన్ రెడ్డి, సీ. రామచంద్రయ్య, డిసిసిబి చైర్మన్ తిరుపాల్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరైయ్యారు.
ఒంటిమిట్ట ఏకశిలా గ్రాండ్ హోటల్ లో వైఎస్ జగన్ జన్మదిన సందర్భంగా జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం,కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, నందకికిషార్ రెడ్డి, ఒబుల రెడ్డి నాగార్జున పాల్గొన్నారు.
జమ్మలమడుగు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
పులివెందుల : వేంపల్లిలో మాజీ జెడ్పీటీసీ షబ్బీర్ వలి ఆధ్వర్యంలో సీఎం వైఎస్ జగన్ 47 వ పుట్టినరోజు సందర్భంగా వేంపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 47 కేజీల భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్ ,పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రవికుమార్ రెడ్డి మండల కన్వీనర్ చంద్రఓబుల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి షబ్బీర్ వలి, కార్యకర్తలు పాల్గొన్నారు.
బద్వేలు : వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌పీపీ యువజన విభాగం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలునిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి హాజరరైయ్యారు.
రాయచోటి : నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండ్యం, గాలివీడు, రామపూరం, సంబేపల్లి లలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వెయ్యిమందితో రక్తదానం నిర్వహించారు.
కాజీపేట : వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాఘవ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా వేడుకలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment