చీపురుపల్లిలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న మహిళలు, అభిమానులు
సాక్షి ప్రతినిధి విజయనగరం: ఇంటి బిడ్డ పుట్టినరోజును ఎంత ఘనంగా జరుపుకుంటామో.. అంతకుమించిన సంబరంగా ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలను జిల్లా ప్రజలు జరుపుకున్నారు. వైఎస్‌ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి బొబ్బిలి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ప్రారంభించి జిల్లాలోని 444 మంది నేతన్నలకు ఒక్కొక్కరికీ రూ.24వేలు చొప్పున రూ.1,06,56,000 అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి జన్మదినోత్సవాన్ని నిర్వహించారు.
పుష్పశ్రీవాణి కేక్ కట్ చేసి ఎమ్మెల్యే శంబంగి, జిల్లాకలెక్టర్ హరిజవహర్‌లాల్ తదితరులకు అందజేశారు. కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద వైఎస్సార్‌సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో జరిగిన వేడుకలో ముఖ్య అతిధిగా పుష్పశ్రీవాణి, వైఎస్సార్‌సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు కేక్ కట్ చేశారు. ఆస్పత్రిలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి స్వయంగా రక్తదానం చేశారు. పార్వతీపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో భారీ కేక్‌ను కట్‌చేశారు. సాయంత్రం అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే జోగారావు అధ్యక్షత వహించగా ఉపముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, ఎమ్మెల్యేలు పీడిక రాజన్నదొర, విశ్వాసరాయి కళావతి, చెట్టి ఫల్గుణ, మాజీ ఎంపీ బొత్సఝాన్సీలక్ష్మి కేక్ కట్ చేసి సీఎం పుట్టినరోజు వేడుకలు జరిపారు.
విజయనగరంలో మెగా రక్తదాన శిబిరం
విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. అనంతరం భారీ కేకును కట్ చేశారు. మెగా బ్లడ్ క్యాంప్ ఆర్గనైజింగ్ చైర్మన్ సంగంరెడ్డి బంగారునాయుడు, కో చైర్మన్‌లు అల్లు చాణుక్య, జి.ఈశ్వర్ కౌశిక్‌ల నేతత్వంలో 356 యూనిట్ల రక్తాన్ని వివిధ రక్తనిధి కేంద్రాల వైద్యులు సేకరించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు నగరంలోని హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెలి్పంగ్ హ్యాండ్స్ హిజ్రాస్ అసోసియేషన్ అధ్యక్షురాలు దవడ మీన, కార్యదర్శి స్రవంతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొండబాబు పాల్గొన్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులు పిళ్ళా విజయకుమార్, కాళ్ల గౌరీ శంకర్, పార్టీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి అవనాపు విజయ్ స్థానిక సత్య కార్యాలయంలో కేక్ కట్ చేశారు. అనంతరం ఘోషాస్పత్రి, పూల్‌బాగ్‌లోని ద్వారకామయి అంధుల పాఠశాలలో రోగులకు, విద్యార్థులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
అన్నదానంలో రాజన్నదొర
సాలూరు పట్టణంలోని ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర స్వగృహంలో కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో భారీ కేక్‌ను కట్ చేసి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించారు. శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో ముఖ్యమంత్రి పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పీహెచ్‌సీలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. సాలూరు పట్టణంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద అన్నదానం చేశారు. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎస్‌వి రమణరాజు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సతీమణి బెల్లాన శ్రీదేవి ప్రారంభించారు. అనంతరం కేక్ కట్ చేసి వైఎస్సార్ బీమా చెక్కులను లబి్ధదారులకు అందజేశారు. విద్యార్థులు, మహిళలు పెద్ద ఎత్తున చేరి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
డెంకాడలో దుప్పట్ల పంపిణీ
నెల్లిమర్ల నియోజకవర్గం డెంకాడలో నిర్వహించిన సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా పేదలకు ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు దుప్పట్లు పంపిణీ చేశారు. పూసపాటిరేగలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గజపతినగరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య స్థానిక సామాజిక ఆస్పత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అందజేశారు. శృంగవరపుకోట నియోజకవర్గ కేంద్రంలోని దేవీ జంక్షన్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుతో సహా పలువురు నాయకులు పూలమాలలువేసి నివాళులరి్పంచారు. అనంతరం ఎస్‌కోట ప్రభుత్వాస్పత్రిలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే కేక్ కట్ చేశారు. గురుదేవా చారిటబుల్ ట్రస్టు సౌజన్యంతో వికలాంగులకు ట్రై సైకిళ్లు, కృత్రిమ పరికరాలను అందజేశారు. దిశ చట్టం తేవడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎల్‌కోటలో క్షీరాభిõÙకం నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment