
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ భవన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు పోతల ప్రసాద్, వైఎస్సార్‌సీపీ అభిమానులు కేక్ కట్ చేశారు. రూ. 25లకే ఉల్లిగడ్డలను అందుబాటులోకి తీసుకొచ్చిన సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకోవాలని.. కార్యకర్తలు ఉల్లి గడ్డలను పంచిపెట్టారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని కార్మికనగర్, శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. వికలాంగులకు వీల్‌చైర్స్, అంధ విద్యార్థులకు పరికరాలు పంపిణీ చేశారు.
సిద్ధిపేట : జిల్లాలోని మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నేతలు అన్నబోయిన అశోక్‌గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment