ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా అనంతపురం జిల్లాలో 47 కేజీల భారీ కేక్‌ను కట్ చేశారు. జిల్లా ప్రధాన కేంద్రాలతో పాటు పలు నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
శ్రీకాకుళం: పోలాకిలో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు,అభిమానులు పాల్గొన్నారు.
తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌జగన్ జన్మదినం సందర్భంగా రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కో-ఆర్డినేటర్ శివరామ సుబ్రహ్మణ్యం, జక్కంపూడి విజయలక్ష్మి , బొమ్మన రాజ్‌కుమార్ , ఆకుల వీర్రాజు, గణేష్, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో వాడవాడలా సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొత్తపేట, జొన్నాడలో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అనంతరం రక్తదాన శిబిరాలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్న చిన్నారి నందిని చేత కేక్ కటింగ్ చేయించారు. డి కన్వెన్షన్‌లో భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీతా, డిసీసీబి చైర్మన్ అనంత బాబు, నగర వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు ఫ్రూటీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం: హిందూపురం బాలసదన్‌లో సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ 47వ జన్మదినం సందర్భంగా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద 47 కేజీ భారీ కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సోమందేపల్లి, గోరంట్ల, పెనుకొండ, రొద్దం మండల కేంద్రాల్లో సీఎం వైఎస్ జగన్ జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.
కృష్ణా జిల్లా: పెదపారిపూడి మండలం యలమర్రులో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్, వైఎస్సార్‌సీపీ నాయకులు గోగం సురేష్, గోళ్ళ సోమేశ్వరరావు, కాటూరి అశోక్, కంభం డేవిడ్, గుమ్మడి రామకృష్ణ, మండవ బెనర్జీ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా ఉయ్యూరు గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి కేక్ కట్ చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
మైలవరం పార్టీ కార్యాలయంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కేక్ కోశారు. వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పామర్థి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షుడు షేక్ కరీమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తోట్లవల్లూరు మండలంలో జరిగిన సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. జొన్నాల మోహనరెడ్డి, కిలారం శ్రీనివాసరావు, నడకుదురు రాజేంద్ర, మోర్ల రామచంద్రరావు, మర్రెడ్డి శేషిరెడ్డి, మోటూరి శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కర్నూలు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు,నేతలు సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్, వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి. వై. రామయ్య, మాజీ ఎంపీ బుట్టా రేణుక తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నకల్ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశారు.
పశ్చిమగోదావరి: పోడూరు మండలం కొమ్ముచిక్కాల గ్రామంలో పాలకొల్లు నియోజకవర్గ ఇంచార్జి, డిసీసీబీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు. డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, గుంటూరి పెద్దిరాజు, కలిడింది గణపతిరాజు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కామవరపుకోట మండలంలో జరిగిన వేడుకల్లో ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా 50 కేజీల కేక్ కట్ చేశారు. అధిక సంఖ్యలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలవరం నియోజకవర్గ పరిధిలోని బుట్టాయి గూడెంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment