Happy Birthday YS Jagan: YS Jagan Mohan Reddy Birthday Celebrations at Tadepalli Home - Sakshi Telugu
Sakshi News home page

సీఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

Published Sat, Dec 21 2019 10:37 AM | Last Updated on Sat, Dec 21 2019 12:46 PM

YS Jagan Mohan Reddy Birthday Celebrations - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో శనివారం వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఆయనతో ఉన్నతాధికారులు కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, సీఎం కార్యాలయ కార్యదర్శి ధనుంజయ రెడ్డి, సలహాదారు అజేయ కల్లాం, డీజీపీ గౌతమ్ సవాంగ్, సీఎం కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు చెప్పారు.


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల తర్వాత జరుపుకుంటున్న తొలి పుట్టిన రోజు కావడంతో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయనను స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రులు అదిమూలం సురేష్, బాలినేని శ్రీనివాసరెడ్డి, విశ్వరూప్, పేర్ని నాని, కొడాలి నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు సీఎం వైఎస్‌ జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న అభిమానులు వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు. (సీఎం జగన్‌కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు)

సీఎం జగన్‌కు గవర్నర్‌ శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని గవర్నర్‌ ఆకాంక్షించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement