
ఎవరి ప్రాంతాల్లో వాళ్లే ప్రచారం
జనసేన ప్రాంతాల్లోకి బాబు నో ఎంట్రీ
టీడీపీ నియోజకవర్గాల్లోకి వెళ్లని పవన్
కూటమిలో సీట్లు పంపిణీ ఐతే ఐంది కానీ మనసులు కలవని మనువు మాదిరిగా వారి ప్రయాణం సాగుతోంది... కలివిడిగా ఉందాం అనుకున్నారు కానీ విడివిడిగా వెళ్తున్నారు... టిక్కెట్లు ప్రకటించినా ఎక్కడా ఆ మూడు పార్టీల నాయకులు కలిసి సాగడం లేదు... ఎక్కడికక్కడ గట్లు వేసుకుంటూ నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరిస్తూ వెళ్తున్నారు. ఈ పొత్తు పొసిగేది కాదులే అని జనంలో ఇప్పటికే అభిప్రాయం వచ్చేసింది. ఇదిలా ఉండగా టీడీపీ జనసేన అధ్యక్షులు ప్రచారం మొదలు పెట్టారు. ఇందులో కూడా ఎవరికివారే అన్నట్లుగా ఉంటున్నారు...పవన్ కళ్యాణ్ టూర్ షెడ్యూల్ చూస్తే అదే అర్థం అవుతోంది.
మార్చి 30 నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ కళ్యాణ్ టూర్ చేస్తున్నారు.. ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే అయన వారాహిని సైతం తీసుకొచ్చారు.. పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టగా అందులో భాగంగా ముందుగా టీడీపీ ఇంచార్జ్ వర్మ ఇంటికి వెళ్లి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.. ఇదంతా ఒకెత్తు అయితే అయన పన్నెండు రోజులు చేసే ప్రచారంలో ఎక్కడా టీడీపీ పోటీ చేస్తున్న నియోజకవర్గాలను టచ్ చేయడం లేదు.. సంపూర్ణంగా అయన తన జనసేన అభ్యర్థులున్నచోటనే ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ బీజేపీ అభ్యర్థులు ఉన్న చోట్లకు వెళ్లి మన కూటమి అభ్యర్థులను గెలిపించాడని అని చెప్పే ఉద్దేశ్యం లేనట్లు ఈ షెడ్యూల్ చూస్తే తెలుస్తోంది.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు కూడా కేవలం వాళ్ళ పార్టీ అభ్యర్థులు ఉన్న చోటనే ప్రచారం చేస్తున్నారు. జనసేన అభ్యర్థులు ఉన్న ప్రాంతాలకు పోవడం లేదు.. అంటే ఎవరి అభ్యర్థుల గెలుపు బాధ్యత వాళ్లదే అన్నట్లుగా ఈ పరిణామాలు చూస్తే తెలుస్తోంది. ఆలా ఎవరికీ వాళ్ళే ఉంటే ఇక పొత్తుపెట్టుకుని ఏమి లాభం... మేమెలా గెలుస్తాం అని జనసేన అభ్యర్థులు లోలోన భయపడుతున్నారు. ఇక బయటకు చెప్పకపోయినా టీడీపీ వాళ్ళు కూడా లోలోన భయపడుతున్నారు.. జనసేన ఓట్లు మాకు రాకపోతే... కేవలం తమ ఓట్లతో ఐతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఓడించలేమని వాళ్ళు కలవరపడుతున్నారు.
ఇదిలా ఉండగా మోడీ కూడా త్వరలో ఆంధ్రాలో పర్యటనకు వచ్చి కేవలం బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఉన్న చోటనే ప్రచారం చేస్తారని అంటున్నారు. దానికితోడు మొన్నటి చిలకలూరిపేరిట సభలో సైతం మా ఎంపీ అభ్యర్థులను గెలిపించండి.. ఎన్డీయేకు 400 సీట్లు ఇవ్వండి అని మాత్రమే చెప్పిన మోడీ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం గురించి.. చంద్రబాబు నాయకత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు... దీంతో బీజేపీ సపోర్ట్ కూడా టీడీపీకి అంతంతమంత్రమే అని స్పష్టమైంది. ఇక ఇప్పుడు చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ యాత్రలు..ప్రచార సభలు చూస్తున్నా అలాగే ఉన్నాయ్... అంటే అది చెప్పుకోవడానికే కూటమి తప్ప ఇది వర్కవుట్ అయ్యేది కాదని క్యాడర్ ఆవేదన చెందుతోంది.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment