బాబు, లోకేష్ ఏమైనా చేయొచ్చు
వారికి రాజకీయ లబ్దే పరమావధి
జనసైనికుల్లో కలవరం
అయిపోయాయి.. అన్ని రకాల భూతవైద్యాలు.. చేతబడులు.. బాణామతి.. ఎత్తులు.. జిత్తులు ముగిశాయి. కూటమి విజయానికి చేయాల్సిన కుట్రలన్నీ చేసేశారు. ఎన్ని సపర్యలు చేసినా పక్షవాతం రోగికి చెయ్యి కాలు నోరు రానట్లే కూటమి కూడా నిస్తేజంగా మంచానపడిన రోగిమాదిరి చూస్తుందే తప్ప ప్రయోజనం లేదు. ఈ గుడ్డిగుర్రాన్ని పంచకల్యాణి మాదిరిగా మార్చి యుద్ధానికి బయల్దేరుదాం అనుకున్న చంద్రబాబుకు నిరాశే మిగులుతోంది. పవన్ కల్యాణ్‌కు చేర్చుకోవడం ద్వారా కాపుల ఓట్లు గంప గుత్తగా కొట్టేద్దాం. దాదాపు యాభై నియోజకవర్గాల్లో కాపులకు ప్రాబల్యం ఉంది కాబట్టి అవనీ హోల్‌సేల్ లాక్కోవచ్చని భావించి 21 సీట్లు ఇచ్చినా అదీ పెద్ద వర్కవుట్ కావడం లేదు.
పవన్ ప్రభావం భారీగా ఉంటుందని ఆశించిన తూర్పు గోదావరి జిల్లాలోనే దాని ఫలితం అంతంతమాత్రం అని తెలుస్తోంది. గోదావరికి వరదలు తెచ్చే స్థాయిలో ఓట్లు తెస్తాడు అనుకున్న పవన్ సైతం పిఠాపురంలో గెలుపు కష్టమే అని ఎదురీదుతున్న తరుణంలో ఇక బాబులో అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఏమి చేస్తే ఈ బతుకు బాగవుతుంది దేవుడా అనుకుంటున్నా తరుణంలో అయన ఇంకో కుట్రకు కూడా పాల్పడే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కు హాని తలపెట్టి ఆ అఘాయిత్యాన్ని ప్రభుత్వం మీదకు నెట్టేసేందుకు సైతం కుట్ర పన్నుతున్నట్లు జనసైనికులు భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే ముందుగానే తమకు అనుకూలమైన పత్రికల్లో వార్తలు, కథనాలు రాయించి ఎన్నికల ముందు పవన్ మీద దాడి చేయించి దాన్ని ప్రభుత్వం వైఫల్యం అని బుకాయించి ఆ గాయాల నుంచి లభ్ది పొందాలని టీడీపీ, చంద్రబాబు కుట్ర పన్నుతున్నట్లు సందేహాలున్నాయి. ఈమేరకు ఇప్పటికే చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు ఒక అవగాహనా కుదిరిందా అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ విషయం మీద ఇప్పటికే పవన్ కూడా పలు సార్లు కామెంట్లు చేశారు. తనమీద దాడులు చేసేందుకు రౌడీలు సిద్ధంగా ఉన్నారని, బ్లేడ్లు పట్టుకుని తమవాళ్లను కోస్తున్నారని కూడా అన్నారు.
అంతే కాకుండా తానూ ఎలాంటి దాడులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ రెచ్చగొడుతున్నారు. చూస్తుంది బయటివాళ్ల సంగతి ఏమోకానీ చంద్రబాబు పురమాయించినవాళ్ళే పవన్ మీద దాడి చేసి, అయ్యో..మన బిడ్డకు ఘోరం జరిగిందని కొందరు అద్దె మనుషుల ద్వారా డ్రామా నడిపించి కాపుల ఓట్లు దండుకునేందుకు కుట్రలకు తెగబడవచ్చని జనసైనికులు, ఇంకా చంద్రబాబు నైజం తెలిసినవాళ్ళు అంటున్నారు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడంలో చంద్రబాబును మించినవాళ్లు లేరని, రాజకీయ ప్రయోజనం కోసం ఆయన ఎంతటికైనా దిగజారుతారని తెలిసినవాళ్ళు గుర్తు చేస్తున్నారు. అందుకే పవన్... నువ్వు జరంత పైలం బిడ్డా అని జాగ్రత్తలు చెబుతున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment