దేశంలో ప్రస్తుతం పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్లు..పాన్ ఇండియా క్రికెటర్లు..పాన్ ఇండియా బిజినెస్ మెన్..పాన్ ఇండియా హీరోలు..పాన్ ఇండియా మార్కెట్ ఉన్న నటీనటులు.. ఇదీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న అంశం .అయితే పబ్లిసిటీ అంటే పీక కోసుకునే చంద్రబాబుకు కూడా ఇప్పుడు జాతీయస్థాయి లీడర్‌గా ఎదగాలనే పిచ్చి పట్టుకుంది. దేశంలో తన కన్నా సీనియర్ నాయకులు లేరని. మోడీ తదితరులు కూడా తనకన్నా జూనియర్లు అని పదే పదే చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు పబ్లిసిటీతో అయినా సరే మీడియాను కొనేసి అయినా సరే.. లేకుంటే కొత్త పబ్లిసిటీ వ్యవస్థను ఏర్పాటు చేసి అయినా సరే యమర్జంట్‌గా పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అవ్వాలని తెగ ఆరాట పడుతున్నారు.
ఈ క్రమంలోనే దావోస్ సదస్సుకు చంద్రబాబు లోకేష్ వెళ్లగా దానికి సంబంధించి జాతీయ స్థాయిలో ప్రచారం చేసే నిమిత్తం ఎన్డీటీవీ.. ఐబీఎన్ వంటి జాతీయ ఇంగ్లీష్ ఛానల్ కు భారీ ఎత్తున డబ్బు గుమ్మరించారు. దీంతో ఆ చానళ్ళు చంద్రబాబు ఆహా ఓహో అంటూ జాకీలు పెట్టి లేపుతున్నాయి.
👉చదవండి : భజన బ్యాచ్.. కొన్నాళ్ళు సైలెంట్‌గా ఉండండమ్మా
ఆ సదస్సు ద్వారా రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వస్తాయన్నది గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడే తేటతెల్లమైంది. ఆయన ఎప్పుడు అధికారంలో ఉన్న ఏటా దావో సదస్సుకు వెళ్లడం.. ఫోటోలు పబ్లిసిటీ చేసుకోవడం తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చింది లేదు. కానీ అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో చర్చలు జరుగుతున్నాయి... అదిగో భారీ పరిశ్రమ.. ఇదిగో వేలల్లో ఉద్యోగాలు అంటూ ఊదరగొట్టడం అందరికీ తెలిసిందే.
వాస్తవానికి చంద్రబాబుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహా టీవీ, తోపాటు పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు . వందల సంఖ్యలో ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ పేజీలు.. వేలల్లో సోషల్ మీడియా కార్యకర్తలు నిత్యం భజన చేస్తూ ఎలివేషన్లు ఇస్తున్నారు.
చంద్రబాబు ప్రస్తుతం ఏం చేస్తానన్నది ప్రజలకు చెప్పారు కానీ వచ్చే పాతికేళ్లు.. రానున్న 50 ఏళ్లలో రాష్ట్రాన్ని అలా మారుస్తా? ఇలా మారుస్తా అంటూ మభ్య పెట్టడం అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల కిందట విజన్ 2020 అంటూ కథలు చెప్పారు కానీ ఏమీ చేసింది లేదు. ఇప్పుడు ఏకంగా విజన్ 2047 అంటున్నారు. ఈ కథలన్నీ ప్రజలతో నమ్మించడానికి సరికొత్త ఏజెన్సీ సృష్టించడానికి ప్రభుత్వం పథకం సిద్ధం చేసింది.
👉చదవండి : దావోస్ వెళ్దాం.. పబ్లిసిటీ బారెడు.. దక్కేది చెంచాడు!
ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకు సమాచారం అందించడానికి ప్రభుత్వం తరఫున సమాచార శాఖ ఉండనే ఉన్నది. దీనిలో ఐఏఎస్ అధికారి తో పాటు ఎంతమంది సీనియర్ జర్నలిస్టులు, జేడీలు, డీడీలు, ఏడీలు, డీపిఆర్ఓ, కేడర్లో పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్లంతా సరిపోలేదని మరో ప్రైవేట్ ఏజెన్సీని తీసుకొచ్చి చంద్రబాబు కు ఎలివేషన్..జాతీయ స్థాయి ప్రచారం కల్పించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అంటే ఆ ఏజెన్సీకి ప్రజాధనం ధారవోసి చంద్రబాబుకు పబ్లిసిటీ ఇప్పిస్తారన్నమాట.
దీనికోసం కొత్త ఏజెన్సీని ఏర్పాటు చేస్తున్నారు. అందులో భారీ ఎత్తున సిబ్బందిని నియమించి వారితో బాబుకి ఎలివేషన్ ఇప్పిస్తారన్నమాట.దీంతోపాటు ఇద్దరు ఉద్యోగులను ప్రోగ్రాం కోఆర్డినేటర్లుగా నియమించి వారికి రూ.లక్షన్నర జీతం ఇవ్వాలని నిర్ణయించారు. వారు చంద్రబాబు పర్యటనకు..సభలు సమావేశాలకు సంబంధించిన వివరాలను మీడియాకు అందజేస్తారు. ఇటు తమ అనుకూల మీడియాకు కోట్లు దారబోస్తూనే ప్రైవేటు ఏజన్సీ ద్వారా కూడా భారీ ఎత్తున పబ్లిసిటీ చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మొత్తానికి ఎదైనాగానీ చంద్రబాబు తక్షణం జాతీయ స్థాయి నాయకుడు అయిపోవాలి..అదే టీడీపీ లక్ష్యం.
👉చదవండి : లోకేష్‌కు ఫుల్ ఎలివేషన్.. కాబోయే డిప్యూటీ సీఎం?
సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment