నాయకుడి రూపం...గారడీ వేషం | Special Article On Chandra Babu Fake Promises | Sakshi
Sakshi News home page

నాయకుడి రూపం...గారడీ వేషం

Published Sun, Apr 28 2024 3:56 PM | Last Updated on Sun, Apr 28 2024 3:56 PM

Special Article On Chandra Babu Fake Promises

బాబు మాటలకు చేతలకు పొంతన కరువు

మగాడంటే జగన్ ..నాయకుడంటే జగన్ అంటున్న జనం

మాటలది ఏముంది..ఏమైనా చెప్పొచ్చు ఎన్నైనా చెప్పొచ్చు..మబ్బులు తెచ్చి ఒళ్ళో పోస్తాను అనొచ్చు.. జాబిల్లిని తెచ్చి చేతికి ఇస్తామనోచ్చు. కానీ నిజంగా ఆ మాట నిలుపుకున్నపుడు కదా ఆ మాటకు, ఇచ్చినవాడికి విలువ.. రాజకీయంగా చూస్తే చంద్రబాబు గత నలభయ్యేళ్లుగా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు... అసలు మేనిఫెస్టో అనేది ఆయనకు ఒక చిత్తుకాగితంతో సమానం. ఎన్నికలప్పుడు వెయ్యిమాటలు చెప్పడం.. ఒక్కటంటే ఒక్కటీ చేయకుండా..మాయమాటలతో పూటగడిపేయడం...మళ్ళీ అవే హామీలను ఇస్తూ మరో ఎన్నికకు సిద్ధం కావడం..అదే అయన కెరీర్ మొత్తం..సాగిపోయింది.

2014 లో కూడా ఇలాగే రైతు రుణమాఫీ... డ్వాక్రా రుణ మాపీ....నిరుద్యోగ భృతి అంటూ వందలాది పథకాల పేర్లు చెప్పి ఓట్లేయించుకుని చివరకు మేనిఫెస్టో కూడా దొరక్కుండా దాచేసారు. మళ్ళీ ఇప్పుడు అదే హామీలు ఇస్తూ 2024 ఎన్నికలకు చంద్రబాబు.. జనసేనాని కలిపి సిద్ధం అవుతున్నారు. ఇక సీఎం వైఎస్‌ జగన్ ఐతే నవరత్నాలు అంటూ తాను అమలు చేయగలిగే హామీలు మాత్రమే జాబితాలో చేర్చి వాటిని తూచా తప్పకుండా అమలు చేసారు.. అమ్మఒడి, ఆసరా.. సున్నా వడ్డీ , రైతు భరోసా.. జగనన్న విద్యా దీవెన , విద్యా కనుక, ముప్పై లక్షలమందికి ఇళ్ళు, కాపునేస్తం...ఇలా జాబితాలో చేర్చినవన్నీ చేసుకుంటూ వెళ్లారు.. ఆర్థికంగా అది ఖజానాకు భారమే అయినా ప్రజలకు మాట ఇచ్చాము కాబట్టి ఎలాగైనా చేయాలన్న పట్టుదల, తలంపుతో రెండేళ్లు కోవిద్ కారణంగా ఖజానా వట్టిపోయినా జగన్ మాత్రం వెనక్కి తగ్గకుండా పథకాలు ఇచ్చారు.

ఈ ఎన్నికలకు సైతం తాను చేయగలిగేవే చేస్తాను అంటూ ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే అమ్మఒడి, రైతు భరోసా, పెన్షన్ కానుకలను మాత్రం మరింతగా పెంపుదల చేస్తాను అని చెప్పారు. ఇక చంద్రబాబు మాత్రం ఎలాగూ అమలు చేయరు కాబట్టి... అలవిమాలిన హామీలన్నీ ఇస్తున్నారు...కానీ చేయి చాచి సాయం చేసేది ఎవరు... వట్టినే నోటితో మాటలు చెప్పి చేతల్లో సున్నా చుట్టేది ఎవరన్నది ప్రజలకు తెలుసు... చంద్రబాబును గత పదేళ్లుగా గమనిస్తున్న వాళ్లందరికీ అయన నిజరూపం ఏమిటన్నది తెలుసు..అందుకే అయన ఎన్ని హామీలిచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇక జగన్ పథకాల పేరిట రాష్ట్రాన్ని అప్పులపాల్జేస్తున్నారు అని ఆరోపించేవాళ్లకు చంద్రబాబు ఇస్తున్న భారీ హామీలు కనిపించవా ? అయన లక్షలకోట్ల ఇచ్చుకుంటూ పొతే రాష్ట్రం మరింత కుదేలవదా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో ఇప్పుడున్న పథకాలు ఇవ్వడమే గొప్ప... అది కూడా జగన్ ఒక్కడే చేస్తారు... వేరేవాళ్లకు సాధ్యం కాదని అవగతం చేసుకున్న ప్రజలు మళ్ళీ జగన్ మాత్రమే మనకు ఉండాలి అని నిర్ణయించుకున్నారు.  
-సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement