మంగళగిరిలోనే కష్టం. ఇక తమిళనాడులో గెలిపిస్తాడా ?
లోకేష్ ప్రచారం మీద పేలుతున్న సెటైర్లు
కూట్లో రాయి తీయలేనివాడు... ఆంటే తింటున్న అన్నంలో చిన్న రాయిని తీయాలని లోకేష్ ఏకంగా ఏట్లోని అంటే నదిలోని రాయిని తీస్తాడా అనే సందేహం క్యాడరుకు వస్తోంది. మూడుశాఖలకు మంత్రిగా పని చేసి మంగళగిరిలోనే ఓడిపోయినా లోకేష్ పక్క రాష్ట్రానికి వెళ్లి ప్రచారం చేస్తారా? అంత ధైర్యం దేనికి అనే పంచులు పేలుతున్నాయి. వాస్తవానికి లోకేష్ యువగళం పేరిట భారీగా పాదయాత్ర చేసినా పార్టీకి కానీ ఆయనకు కానీ పెద్ద మైలేజి రాలేదు. దేంతోబాటు అయన తిండి యావ. తింగరి మాటలు కలిసి అయన ప్రతిష్టను మరింతగా దిగజార్చాయి.
దీంతో ఆయన్ను మళ్ళీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారానికి తిప్పాలన్న చంద్రబాబు ఆలోచనలకూ పార్టీ నాయకులు గండి కొట్టారు. లోకేష్‌ను మళ్ళీ తమ నియోజకవర్గాలకు పంపించవద్దని, తామే ఏదోలా ప్రచారాన్ని పూర్తిచేసుకుంటామని చంద్రబాబుకు చెప్పడంతో అయన తన కొడుకు కాళ్లకు బంధనాలు వేసి అమరావతి మినహా ఇంకెక్కడికీ వెళ్లోద్దని సూచించారు. అంటే లోకేష్‌కు ప్రస్తుతం అమరావతిలో గెలుపే పెద్ద టాస్క్ అన్నమాట.
చదవండి: సీఎంగా మళ్లీ జగన్ గెలిస్తేనే అన్ని వర్గాలకు న్యాయం: మంత్రి బొత్స
ఇదిలా ఉండగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న టీడీపీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో సైతం గెలిపించేందుకు యాతనపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో ఉన్నపుడే బీజేపీ.. టీడీపీ మధ్య సఖ్యత కుదరడం లేదు. దీంతో ఎక్కడబడితే అక్కడ టీడీపీ బీజేపీ క్యాడర్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు లోకేష్ ఏకంగా తమిళనాడు వెళ్లి అక్కడ బీజేపీకోసం ప్రచారం చేస్తారని ఆ రాష్ట్ర బీజేపీశాఖ చెబుతోంది.
తమిళనాడులోని కోయంబత్తూరులో లోకేష్ రోడ్డు షో.. ప్రచారం.. సభలో సైతం మాట్లాడతారని బీజేపీచెబుతోంది. కోయంబత్తూరు ఆ చుట్టుపక్కల తెలుగువాళ్లు. ముఖ్యంగా లోకేష్ సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఓట్లు ఉండడంతో ఆ ప్రాంతాల్లో లోకేష్ ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తమిళనాడు బీజేపీ శాఖ ట్విట్టట్లో పెట్టిన ఈ పోస్టు చూసి ఆంధ్రాలో అప్పుడే పంచులు పేలుతున్నాయి.
నీ మంగళగిరిలోనే నువ్వు గెలుస్తావో లేదో నీకే తెలీదు.. అలాంటిది నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్లి అక్కడేం సాధిస్తావు పప్పూ అంటూ సెటైర్లు వేస్తున్నారు, వాస్తవానికి లోకేష్ ఈసారి కూడా మంగళగిరిలో గట్టిగా కష్టపడితే తప్ప గెలుస్తారో లేదో తెలియని పరిస్థితి అలాంటపుడు అయన ఇక్కడ వదిలేసి పక్కరాష్ట్రానికి ఎందుకు వెళ్లడం అనే ప్రశ్నలు.. వస్తున్నాయి.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment