కూటమి ప్రభుత్వానికి బీపీ.. వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో హ్యాపీ
అయిపొయింది.. కూటమి సర్కారు హనీమూన్ టైం ముగిసింది ... తమను ఎలా మోసం చేస్తున్నదీ ప్రజలకు సైతం అర్థం అవుతోంది. సూపర్ సిక్స్ .. భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు .. మంచి ప్రభుత్వం అన్నారు.. చాలా చాలా అన్నారు కానీ అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుని నిజరూపం తెలుస్తుంది అన్నారు అబ్రహం లింకన్. చంద్రబాబు సైతం ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక పాటించలేదు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబును ప్రతిసారీ గెలిచాక మాట తప్పడం అయన అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలిచీగెలవగానే తన నిజరూపం చూపుతున్నారు. విద్యుత్ చార్జీల భారం మోపడం మొదలైంది. ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదు.
వైఎస్ జగన్ హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకమూ ఇప్పుడు ఇవ్వడం లేదు. అన్నిటికీ మించి వైఎస్‌సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద... ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు.. మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి . ఎక్కడా లేని సెక్షన్ల కింద కేసులు పెట్టడం రాష్టాన్ని కుదిపేసింది. ఇక ఇన్నాల్లమాదిరిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే కుదరదు .. జనంలోకి వెళ్లాల్సిందే.. చంద్రబాబు తీరును ఎండగట్టాల్సిందే అని నిర్ణయించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక ఉపేక్షించరాదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబ చేస్తున్న తప్పిదాలు.. దాష్టీకాలను ప్రజలముందు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.
గత ఆర్నెళ్లుగా చంద్రబాబు అమలు చేసిన సొంత ఎజెండా.. లోకేష్ అమలు చేసిన వ్యక్తిగత రెడ్ బుక్ ఎజెండాలను ప్రజలముందు పెట్టి క్యాడర్ కు భరోసా ఇవ్వాలని జగన్ భావించడం పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి.. జగన్ మోహన రెడ్డి అంటేనే ప్రజలు.. ఆ కుటుంబం అంటేనే జనం.. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనానికి.. పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న భిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అయన ఇకముందు జనంలోనే ఉండాలని నిర్ణయించుకోవడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏడాదిన్నర తరువాత జరిగే పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలకు క్యాడరును సిద్ధం చేసేందుకు సైతం జగన్ పర్యటనలు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
వాస్తవానికి ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైనా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కు ప్రజల్లో నిక్కచ్చిగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అటు కూటమి పార్టీలన్నీ కలిస్తే తప్ప జగన్ను ఓడించలేని పరిస్థితి అన్నది అందరికి తెలిసిందే.. ఇలాంటి తరుణంలో జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఆ 40 శాతం ప్రజలతోబాటు తెలుగుదేశం పాలనపట్ల పెద్దగా ఆసక్తిలేని వారిని సైతంఆకట్ట్టుకునే పనిలో ఉంటారని క్యాడర్ భావిస్తోంది. ఆయన జిల్లాలకు వచ్చినట్లయితే.. అక్కడే బస చేస్తారు.. ఆ సందర్భంగా సర్పంచ్ స్థాయి నుంచి జడ్పి చైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని నాయకులూ.. కార్యకర్తలు ఆయన్ను కలిసి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించే అవకాశాలు మోసం ఎదురుచూస్తున్నారు. స్థానికంగా ఉన్న విభేదాలు.. అక్కడక్కడా ఎదురవుతున్న చిక్కులన్నీ జగన్ దృష్టికి వెళతాయి. దీంతో అయన వర్దిని అక్కడికక్కడే సరిదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లాలన్న అటు టీడీపీకి ప్రాణసంకటంగా మారగా ఇటు వైసిపి క్యాడర్ కు సంతోషాన్ని పంచుతోంది.
వాస్తవానికి జగన్ ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు.. పులివెందులతోబాటు డయేరియా బాధితులను పరామర్శించేందుకు విజయనగరం జిల్లా గుర్ల వచ్చారు. ఆ సందర్భాంగా ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు. ఆయన్ను అభిమానంతో ఆదరించారు. ఇదే సందర్భంగా జగన్ ఉంటే తమకు మరింత బాగుండేదని.. పేదలకు పథకాలు వచ్చేవని .. స్కూళ్ళు.. ఆస్పత్రులు బాగుండేవని.. అమ్మ ఒడి అందేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఆ ఆదరణను మరింత ప్రోది చేసుకునే క్రమంలో జగన్ జనంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది..
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment