Districts tour
-
సంక్రాంతి నుంచి జనంలోకి జగన్
అయిపొయింది.. కూటమి సర్కారు హనీమూన్ టైం ముగిసింది ... తమను ఎలా మోసం చేస్తున్నదీ ప్రజలకు సైతం అర్థం అవుతోంది. సూపర్ సిక్స్ .. భవిష్యత్తుకు గ్యారెంటీ అన్నారు .. మంచి ప్రభుత్వం అన్నారు.. చాలా చాలా అన్నారు కానీ అధికారం ఇచ్చి చూడు ఒక నాయకుని నిజరూపం తెలుస్తుంది అన్నారు అబ్రహం లింకన్. చంద్రబాబు సైతం ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉన్నపుడు చెప్పే మాట అధికారంలోకి వచ్చాక పాటించలేదు. నాలుగుసార్లు సీఎం అయిన చంద్రబాబును ప్రతిసారీ గెలిచాక మాట తప్పడం అయన అలవాటుగా మారింది. ఇప్పుడు కూడా చంద్రబాబు గెలిచీగెలవగానే తన నిజరూపం చూపుతున్నారు. విద్యుత్ చార్జీల భారం మోపడం మొదలైంది. ఇచ్చిన హామీలేవీ అమలు కావడం లేదు.వైఎస్ జగన్ హయాంలో అమలయ్యే ఏ సంక్షేమ పథకమూ ఇప్పుడు ఇవ్వడం లేదు. అన్నిటికీ మించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద... ముఖ్యంగా టీడీపీ తప్పిదాలు.. మోసాల మీద సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్న వైసిపి సోషల్ మీడియా కార్యకర్తలను వెంటాడి . ఎక్కడా లేని సెక్షన్ల కింద కేసులు పెట్టడం రాష్టాన్ని కుదిపేసింది. ఇక ఇన్నాల్లమాదిరిగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుంటే కుదరదు .. జనంలోకి వెళ్లాల్సిందే.. చంద్రబాబు తీరును ఎండగట్టాల్సిందే అని నిర్ణయించుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక ఉపేక్షించరాదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబ చేస్తున్న తప్పిదాలు.. దాష్టీకాలను ప్రజలముందు నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు.గత ఆర్నెళ్లుగా చంద్రబాబు అమలు చేసిన సొంత ఎజెండా.. లోకేష్ అమలు చేసిన వ్యక్తిగత రెడ్ బుక్ ఎజెండాలను ప్రజలముందు పెట్టి క్యాడర్ కు భరోసా ఇవ్వాలని జగన్ భావించడం పార్టీ వర్గాల్లో హుషారును రేకెత్తిస్తోంది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి.. జగన్ మోహన రెడ్డి అంటేనే ప్రజలు.. ఆ కుటుంబం అంటేనే జనం.. అలాంటిది ప్రతిపక్షంలోకి వచ్చాక జగన్ జనానికి.. పార్టీ కార్యకర్తలకు దూరం అయ్యారన్న భిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో అయన ఇకముందు జనంలోనే ఉండాలని నిర్ణయించుకోవడం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఏడాదిన్నర తరువాత జరిగే పంచాయతీ.. మున్సిపల్ ఎన్నికలకు క్యాడరును సిద్ధం చేసేందుకు సైతం జగన్ పర్యటనలు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల్లో ఘోరపరాభవం ఎదురైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజల్లో నిక్కచ్చిగా 40 శాతం ఓటు బ్యాంకు ఉంది. అటు కూటమి పార్టీలన్నీ కలిస్తే తప్ప జగన్‌ను ఓడించలేని పరిస్థితి అన్నది అందరికి తెలిసిందే.. ఇలాంటి తరుణంలో జగన్ మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఆ 40 శాతం ప్రజలతోబాటు తెలుగుదేశం పాలనపట్ల పెద్దగా ఆసక్తిలేని వారిని సైతంఆకట్ట్టుకునే పనిలో ఉంటారని క్యాడర్ భావిస్తోంది. ఆయన జిల్లాలకు వచ్చినట్లయితే.. అక్కడే బస చేస్తారు.. ఆ సందర్భంగా సర్పంచ్ స్థాయి నుంచి జడ్పి చైర్మన్ వరకు వివిధ స్థాయిల్లోని నాయకులూ.. కార్యకర్తలు ఆయన్ను కలిసి క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితిని వివరించే అవకాశాలు మోసం ఎదురుచూస్తున్నారు. స్థానికంగా ఉన్న విభేదాలు.. అక్కడక్కడా ఎదురవుతున్న చిక్కులన్నీ జగన్ దృష్టికి వెళతాయి. దీంతో అయన వర్దిని అక్కడికక్కడే సరిదిద్ది పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ ప్రజల్లోకి వెళ్లాలన్న అటు టీడీపీకి ప్రాణసంకటంగా మారగా ఇటు వైసిపి క్యాడర్ కు సంతోషాన్ని పంచుతోంది.వాస్తవానికి జగన్ ఎన్నికల ఫలితాల తరువాత గుంటూరు.. పులివెందులతోబాటు డయేరియా బాధితులను పరామర్శించేందుకు విజయనగరం జిల్లా గుర్ల వచ్చారు. ఆ సందర్భాంగా ఎలాంటి జనసమీకరణ చేయకపోయినా ప్రజలు అధికసంఖ్యలో వచ్చారు. ఆయన్ను అభిమానంతో ఆదరించారు. ఇదే సందర్భంగా జగన్ ఉంటే తమకు మరింత బాగుండేదని.. పేదలకు పథకాలు వచ్చేవని .. స్కూళ్ళు.. ఆస్పత్రులు బాగుండేవని.. అమ్మ ఒడి అందేదని ప్రజలు బహిరంగంగానే చర్చించుకోవడం జగన్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణను స్పష్టం చేస్తోంది. ఆ ఆదరణను మరింత ప్రోది చేసుకునే క్రమంలో జగన్ జనంలోకి వస్తున్నట్లు తెలుస్తోంది..-సిమ్మాదిరప్పన్న -
జిల్లాల పర్యటనకు YSRCP అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
సంక్రాంతి తర్వాత.. కార్యకర్తలతో జగనన్న
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం ప్రకటించారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే క్రమంలో.. జిల్లాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నారాయన. సంక్రాంతి తర్వాత ఈ పర్యటనలు ప్రారంభం కానున్నట్లు తెలిపారాయన.తాడేపల్లిలో ఉమ్మడి కృష్ణా నేతలతో ఇవాళ వైఎస్ జగన్ సమావేశం అయ్యారు. ఈ భేటీలోనే ఆయన జిల్లాల పర్యటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేశారు. ‘‘కార్యకర్తలతో జగనన్న, పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’’ కార్యక్రమం పేరిట జిల్లాలకు జగన్ వెళ్లనున్నారు. ఈ పర్యటనల్లో నేరుగా పార్టీ కార్యకర్తలతో వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ప్రతీ బుధ,గురువారాల్లో పూర్తిగా వాళ్లతోనే ఉండనున్నారు. వాళ్ల నుంచి పార్టీ బలోపేతానికి సలహాలు తీసుకోనున్నారు. ఇందుకోసం రోజూ 3 నుంచి 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. అలాగే ప్రతీ పార్లమెంట్ నియోజక వర్గంలో సమీక్షలు జరపనున్నారు. వైఎస్ జగన్ జిల్లాల పర్యటనలకు సంబంధించి పార్టీ ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
కేటీఆర్ జిల్లాల పర్యటన.. సిట్టింగ్‌ల గుండెల్లో గుబులు
గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాల పర్యటన సిట్టింగుల గుండెల్లో గుబులు రేపుతోంది. కేటీఆర్ పర్యటిస్తున్న నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు తమ పరిస్థితి ఏంటా అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని సెగ్మెంట్లలో సిట్టింగులకు సీటు ఖరారు చేస్తున్నట్లు ప్రకటించడంతో వారిలో సంతోషం కనిపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ టూర్ పట్ల పార్టీ ఎమ్మెల్యేల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్నికల శంఖారావాన్ని దాదాపు పూరించారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారికంగా ప్రచారం ప్రారంభించేలోగా..రాష్ట్రాన్ని ఓ చుట్టు చుట్టేస్తున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు జరుపుతున్నారు. బీఆర్ఎస్ విధానాలు వివరిస్తూ..బీజేపీ, కాంగ్రెస్ విధానాలను ప్రజల్లో చర్చకు పెడుతున్నారు. వివాదాలు లేని చోట సిట్టింగులను, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను అభ్యర్థులుగా ఖరారు చేస్తున్నారు. సమస్యాత్మకంగా ఉన్నవి, వివాదాలతో కూడుకున్న సెగ్మెంట్ల అభ్యర్థులపై నిర్ణయం పార్టీ అధినేతే తీసుకుంటారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈమధ్యన తరచుగా కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జమ్మికుంట పర్యటనలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని గెలిపించుకోవాలంటూ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ సెగ్మెంట్లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. మాజీ ఎంపీ వినోదే వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి అని తేల్చేసారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ను ఇంటికి పంపి.. వినోద్‌ను గెలిపించాలంటూ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ నూ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. అటు వరంగల్ లో వినయ్ భాస్కర్ విషయంలోనూ, కామారెడ్డి జిల్లా జుక్కల్ లో ఎమ్మెల్యే హన్మంత్ షిండే విషయంలోనూ.. ఆశీర్వాద సభల్లో కేటీఆర్ నుంచి ఇలాంటి ప్రకటనలే వెలువడ్డాయి. దీంతో కేటీఆర్ పాల్గొనే సభల్లో అభ్యర్థులను ప్రకటించడం చర్చలకు దారి తీస్తోంది. ఎవరెవరినైతే గెలిపించాలని కేటీఆర్ పిలుపునిచ్చారో వారికి టిక్కెట్ కన్ఫర్మ్ అని స్పష్టమవుతోంది. రామగుండంలో ఎమ్మెల్యే చందర్ గురించి మాట్లాడుతూ.. మంచి యువకుడు, కష్టపడతాడు, ఉద్యమకాలం నుంచీ పనిచేస్తున్నాడు. చిన్న చిన్న పొరపాట్లేమైనా ఉంటే మన బిడ్డ అనుకుని కడుపులో పెట్టుకోవాలి అన్నారే గాని.. ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ను గెలిపించుకోవాలని ఎక్కడా చెప్పలేదు. ఇక పెద్దపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత పేరును కూడా కనీసం ప్రస్తావించలేదు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ఇదే పరిస్థితి అటు బెల్లంపల్లిలో దుర్గం చిన్నయ్యను గెలిపించాలని కూడా చెప్పలేదు. నియోజకవర్గాల్లో కొందరు కనిపించకపోవడం, ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, నిత్యం వివాదాలతో సావాసం చేయడం, అవినీతి ఆరోపణలెదుర్కోవడం.. ఇలా క్లీన్ చిట్ లేనివాళ్ల విషయంలోనే మంత్రి ప్రకటనలు చేయడంలేదా అన్న చర్చకూ తెరలేస్తోంది. జిల్లాల పర్యటనలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కొందరు సిట్టింగ్స్, మాజీల్లో సంతోషాన్ని నింపుతోంది. తమ గురించేమీ ప్రకటన చేయకపోవడంతో కొందరు సిట్టింగ్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. పైగా రాబోయే రోజుల్లో కేటీఆర్ పర్యటించబోయే నియోజకవర్గాల్లో తమ పేరును ప్రస్తావిస్తూ ప్రసంగం చివర్లో గెలిపించాలని పిలుపునిస్తాడా, లేదా అన్న టెన్షన్ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో, నియోజకవర్గ ఇన్‌చార్జుల్లో కనిపిస్తోంది. -
నేటి నుంచే సీఎం జిల్లాల యాత్ర
-
ఎలా చేద్దాం!
* వాటర్‌గ్రిడ్‌పై నేడు జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమీక్ష * సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు * పంచాయతీ రాజ్ పనుల పురోగతిపైనా చర్చించనున్న మంత్రి సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్‌గ్రిడ్’పై కరసత్తు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లాలవారీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో శనివారం ఆయన జిల్లాకు రానున్నారు. వికారాబాద్‌లోని మహవీర్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల పురోగతితోపాటు వాటర్‌గ్రిడ్‌పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్‌రావు, జేసీలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రూ.2,500 కోట్లతో వాటర్‌గ్రిడ్.. ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ కోసం జిల్లా యంత్రాంగం రూ.2,500 కోట్లతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్‌గ్రిడ్ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కృష్ణా నీటితో.. మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాలను గోదావరి నీటితో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక తయారైంది. మొత్తంగా గ్రిడ్ ద్వారా జిల్లాలోని 1,044 హాబిటేషన్లకు తాగునీటిని అందించనున్నారు. ఈ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వే మొదలైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారుకు కొంత సమయం పట్టనుందని, కాగా క్షేత్రస్థాయిలో అన్ని వార్గాలనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గ్రిడ్ ప్రణాళికకు అసలురూపు రానుందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది రెండు పడకల ఇళ్లు
సమగ్ర సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక వచ్చే మంత్రివర్గ భేటీలో నిర్ణయం ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సాక్షి, హైదరాబాద్: రెండు పడక గదుల ఇళ్ల పథకంలో ఎట్టకేలకు కదలిక మొదలైంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల పర్యటన సమయంలో దానిపై అడపాదడపా ప్రకటనలు చేస్తూ వస్తున్న సీఎం బుధవారం ఉన్నతస్థాయిలో సమీక్షించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గృహనిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహా దారు పాపారావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రాజీవ్ శర్మ, ఆ శాఖ గత కార్యదర్శి బుర్రా వెంకటేశం, ప్రస్తుత కార్యదర్శి దానకిశోర్, హౌసింగ్ బోర్డు ఎండీ మహేశ్ దత్ ఎక్కా పాల్గొన్నారు. ఎన్నికల హామీగా ప్రకటించిన ఈ పథకానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కట్టుబడి ఉందని ప్రకటించిన ఆయన తెలంగాణవ్యాప్తంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పనులు మొదలుపెడుతున్నట్టు వెల్లడిం చారు. సమగ్ర సర్వే ఆధారంగా ఇళ్లు లేని వారి వివరాలతో కూడిన జాబితా సిద్ధం చేసుకుని దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉం టుందని పేర్కొన్నారు. హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్ పట్టణాలలో ప్రయోగాత్మకంగా పట్టణ గృహ నిర్మా ణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో చేపట్టాలని ఆదేశించారు. అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనికి విధివిధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వాటిపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకుందామని వెల్లడించారు. ఆ అవినీతి మరకలొద్దు గతంలో ఓట్ల వేట లక్ష్యంగా గృహనిర్మాణ పథ కం కొనసాగి చివరకు అవినీతికి ఆలవాలంగా మారిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. లక్షల ఇళ్లు మంజూరై, వేల కోట్లు ఖర్చయినా ఇంకా ఇళ్లులేని నిరుపేదలు ఉన్నారంటేనే పథకం సాగిన తీరు ఎలా ఉందో చెప్పకనే చెప్తోందన్నారు. నాటి అవకతవకలపై సీఐడీ విచారణలో ప్రతి గ్రామంలో తప్పులు జరిగాయని తేలుతోందన్నారు. రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప పేరుతో జరిగిన ఇళ్ల విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్న ముఖ్యమంత్రి వాటి విషయంలో కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వృథా ఇళ్ల వినియోగంపై సూచనలు అందజేయాలని పేర్కొన్నారు.