బాబు కక్ష సాధింపులో భాగమే వైఎస్‌ జగన్‌పై కేసు: అంబటి రాంబాబు | Ambati Rambabu Satirical Comments On TDP MLA Raghu Rama Over Case Filed On YS Jagan | Sakshi
Sakshi News home page

Ambati Rambabu: బాబు కక్ష సాధింపులో భాగమే వైఎస్‌ జగన్‌పై కేసు

Published Fri, Jul 12 2024 6:12 PM | Last Updated on Fri, Jul 12 2024 6:39 PM

Ambati Rambabu Satirical Comments On TDP MLA Raghu Rama

సాక్షి, గుంటూరు: టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజుపై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. మూడేళ్ల క్రితం జరిగిన వ్యవహారంపై ఇప్పుడు కేసు నమోదు చేయడమంటే అయిపోయిన పెళ్లికి ఇప్పుడు బాజాలు వాయించినట్టు ఉందన్నారు.

కాగా, అంబటి రాంబాబు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘రఘరామ ఫిర్యాదుపై వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో​ పాటుగా పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం అప్రజాస్వామికం. సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ కక్ష సాధింపు చర్యలో భాగంగానే వైఎస్‌ జగన్‌పై కేసు నమోదు చేశారు. అధికారం ఉంది కాబట్టి పోలీసులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. లోకేష్‌ రెడ్‌ బుక్‌లో భాగంగానే ఈ కేసు నమోదు చేశారు.

మీరు ఇలాంటి కేసులు పెట్టి వైఎస్‌ జగన్‌ను భయపెట్టలేరు. పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనను వేధించారని రఘురామ మేజిస్ట్రేట్‌కు నాడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపైన రఘురామ.. సుప్రీంకోర్టుకు వరకు వెళ్లారు. అక్కడ కూడా ఈ కేసు వీగిపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం ఈ ఘటనపై కేసు ఎందుకు నమోదు చేశారు’ అని ప్రశ్నించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement