
సాక్షి, పశ్చిమగోదావరి : ఓడిపోతామనే భయంతో టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. బహిరంగ సభల్లో జేబులో పర్సు ఉందో లేదో చూసుకున్నట్లు ఇప్పుడు ఓటు ఉందో లేదో చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నేత ముదునూరి ప్రసాద్‌రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. అంతా కష్టపడి వైఎస్ జగన్‌ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment