కోడి పందేలపై సుప్రీంకోర్టులో పిటిషన్
హైదరాబాద్: కోడి పందేలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు శనివారం సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు తీర్పు సంప్రదాయాలకు విఘాతం కలిగించేలా ఉందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. కోళ్లకు కత్తి కట్టకుండా, బెట్టింగులకు పాల్పడకుండా కోడి పందేలకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ జనవరి 7వ తేదీన విచారణకు వచ్చే అవకాశం ఉంది.