( ఫైల్ ఫోటో )
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులపై పదే పదే రాద్దాంతం చేస్తున్న విపక్షాలది అసత్య ప్రచారమేనని మరోసారి తేలిపోయింది. పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పులపై వాస్తవాలు బయటపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. ఏపీ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎంకు లోబడే ఉందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికపరిస్థితి ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగానే ఉందని తేల్చిచెప్పారు.
ఈరోజు(సోమవారం) ఏపీ అప్పులపై లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు అడిగిన ప్రశ్నకు నిర్మలా సీతారామన్ తేల్చి అసలు విషయం చెప్పారు. ‘ఏపీ అసెంబ్లీ ఎఫ్‌ఆర్‌బీఎంను పర్యవేక్షిస్తుంది. ఫైనాన్స్ కమిషన్ సిఫారుసులకు లోబడే ఏపీ అప్పులు ఉన్నాయి. 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ. 2,64,451 కోట్లు. 2023 నాటికి ఏపీ అప్పులు రూ. 4,42, 442 కోట్లకు చేరాయి. నాలుగేళ్లలో ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రూ. 1,77,991కోట్లు’ అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment