
సాక్షి, హైదరాబాద్ : పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ప్రముఖ పారిశ్రామికవేత్త రఘరామ కృష్ణంరాజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శనివారం పార్టీ చేరిన ఆయన.. రాష్ట్ర విభజన హామీలు సాధించే సత్తా ఒక్క వైఎస్ జగన్‌కే ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని ఆయన ఆకాంక్షించారు. తాను దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అభిమాని అని... అలాగే వైఎస్ జగన్ కుటుంబంతో అనుబంధం ఉందని తెలిపారు. తటస్తులు కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలంటున్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఆయన అంతకు ముందు వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో కలిసి వైఎస్ జగన్‌ను లోటస్‌పాండ్‌లో కలిశారు. చదవండి...(వైఎస్ జగన్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు)