ఇడుపులపాయ(వైఎస్సార్ జిల్లా): విశ్వాసానికి మారుపేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వ్యాఖ్యానించారు. సమైక్యం కోసం పోరాడుతున్న జగన్పై ఆరోపణలు చేసిన రఘురామరాజు పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామరాజు పార్టీలో ఉన్నది 90రోజులేనని బాలరాజు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసం ఆయన పార్టీలో చేరారని బాలరాజు ఆరోపించారు.
రఘురామరాజు ప్రయోజనాలు నెరవేరవనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారని బాలరాజు విమర్శించారు. రఘురామరాజు డబ్బు మదంతో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని బాలరాజు చెప్పారు.