bala raju
-
‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’
శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రపంచంలో ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదని వాపోయారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని ధర్మాన హెచ్చరించారు. అణచివేత, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు ప్రత్యేక హోదా కావాలంటున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు. -
గిరి‘జన గోడు’
సాక్షి, ఏలూరు: ఉభయ గోదావరి జిల్లాల్లోని గిరిజన మండలాలతోపాటు రాష్ట్ర విభజన తర్వాత రెండు జిల్లాల్లో కలిసిన పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలతో ప్రత్యేక గిరిజన జిల్లా ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై అధికార యంత్రాంగం ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా, గిరిజన జిల్లా ఏర్పాటు అంశం క్రమంగా జఠిలమవుతోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం లేదా మన జిల్లాలోని పోలవరాన్ని కొత్త జిల్లాకు కేంద్రంగా చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ విషయంపై రచ్చ సాగుతోంది. మరోవైపు గిరిజన జిల్లాలో కలవడం తమకు ఇష్టం లేదని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. కొత్త జిల్లా ఏర్పాటు ఇలా.. జిల్లాలో ఇప్పటికే 39లక్షల పైగా జనాభా ఉన్నారు. మొన్నటివరకూ ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్న వేలేరుపాడు, బూర్గంపాడు మండల పరిధిలోని కొన్ని గ్రామాలు కలిసిన కుక్కునూరు మండలాలు జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో విలీనం అయ్యూరుు. తద్వారా ఆ మండలాలకు చెందిన దాదాపు 70వేల జనాభా మన జిల్లాలో చేరింది. దీంతో జిల్లా జనాభా 40 లక్షలు దాటిపోనుంది. జనాభాతోపాటు భూ విస్తీర్ణం, అటవీ విస్తీర్ణం కూడా పెరుగుతున్నారుు. ఈ నేపథ్యంలో గిరిజన మండలాలతో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లాలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, గోపాలపురం, టి.నరసాపురం, కొత్తగా కలిసిన కుకునూరు, వేలేరుపాడు మండలాలతోపాటు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని రంపచోడవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, దేవీపట్నం, ఆ జిల్లాలో కలిసిన కూనవరం, చింతూరు, భద్రాచలం రూరల్ మండలాలతో కలిపి గిరిజన జిల్లా ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. గిరిజనేతరుల ఆందోళన ప్రత్యేక జిల్లా ఏర్పాటుపై జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం, తాడువాయి, వేగవరం, చక్రదేవరపల్లి గ్రామాల్లో సోమవారం అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో నాలుగురోజుల క్రితం జిల్లా కలెక్టర్ స్వయంగా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను సేకరించారు. గిరిజనులు ప్రత్యేక జిల్లాకు ఏర్పాటుకు సానుకూలంగా ఉన్నప్పటికీ గిరిజనేతరులు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొయ్యలగూడెం మండలాన్ని కొత్త జిల్లాలో విలీనం చేయూలనే ప్రతిపాదనకు వ్యతిరేకంగా కన్నాపురం పంచాయతీ సోమవారం తీర్మానం చేసింది. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో తరచూ నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. గోపాలపురం మండలంలోని గిరిజనేతరులు సైతం ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారు. గిరి జన ప్రత్యేక చట్టాల వల్ల తాము నష్టపోతామని ఆ మండలాల్లోని గిరిజనేతరులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా కేంద్రంపై రచ్చ గిరిజన జిల్లా ఏర్పాటు అనివార్యమైతే ఆ జిల్లా కేంద్రం ఎక్కడ ఉండాలనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా గిరిజనులు గట్టిగానే పట్టుపడుతున్నారు. జిల్లాలోని పోలవరం లేదా కేఆర్ పురంలో జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఇక్కడి గిరిజనుల నుంచి వినిపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని అక్కడి గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలోని పోల వరం నుంచి తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వెళ్లేందుకు ప్రస్తుతం నేరుగా మార్గం లేదు. పోలవరం నుంచి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి మీదుగా గోదావరిని దాటి రాజమండ్రికి.. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్లాలి. అంటే దాదాపు 120 కిలోమీటర్లు చుట్టుతిరిగి వెళ్లాల్సి వస్తుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి పోలవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం వరకూ రోడ్డు నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే ఈ రెండు ప్రాం తాల మధ్య దూరం 50 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ఇటు ఖమ్మం జిల్లా నుంచి కలిసిన మండలాలకు సైతం దూరం తగ్గుతుంది. ఈ సౌలభ్యం ఉందనే కారణంగా పోలవరాన్ని జిల్లా కేంద్రం చేయాలని జిల్లాలోని గిరిజనులు కోరుతున్నారు. ఐటీడీఏను విస్తరిస్తారా గిరిజన జిల్లా ఏర్పాటు ఆలస్యమయ్యేలా ఉంటే గిరిజన సంక్షేమ శాఖ (ఐటీడీఏ)ను విస్తరించాల్సి వస్తుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ రెవెన్యూ డివిజన్లోని కుకునూరు, వేలేరుపాడు మండలాలు పూర్తిగా (73 గ్రామాలు), బూర్గంపాడు మండలాన్ని పాక్షికంగా (6 గ్రామా లు) జిల్లాలోని జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్లో కలపాలని నిర్ణయించారు. ఇప్పటివరకూ ఈ మండలాలు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. వీటిని జిల్లాలోని కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలోకి తీసుకురావాల్సి ఉంది. ప్రస్తుతం కేఆర్ పురం ఐటీడీఏ పరిధిలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాలు ఉన్నాయి. కలెక్టర్‌ను కలిసిన బాలరాజు కొత్తగా ఏర్పాటయ్యే గిరిజన జిల్లా కేంద్రంగా పోలవరాన్ని ఎంపిక చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కలెక్టర్ కాటమనేని భాస్కర్‌ను సోమవారం కోరారు. ఇరు జిల్లాలకు అందుబాటులో ఉండటంతోపాటు ఇందిరా సాగర్ జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న దృష్ట్యా పోలవరానికి ప్రాధాన్యత ఏర్పడిందని కలెక్టర్‌కు సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని బాలరాజుకు కలెక్టర్ హామీ ఇచ్చారు. -
తల్లి జోలికి వచ్చారో..??
మోదకొండమ్మ ఆలయం అప్పగింతపై నిరసన రాజకీయాలకు అతీతంగా నేడు బంద్‌కు పిలుపు బాలరాజు తీరును ఎండగడుతున్న భక్తులు పాడేరు, న్యూస్‌లైన్ : పాడేరులోని మోదకొండమ్మ ఆలయా న్ని దేవాదాయ శాఖ పరిధిలో చేర్చడాన్ని భక్తులు, రాజకీయ, వర్తక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏళ్లనాటి నుంచీ అమ్మవారి ఆలయాన్ని తాము కాపాడుకుంటూ వస్తున్నామని, అసలు గుడిపై ఏ హక్కు ఉందని మంత్రి బాలరాజు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు గురువారం బంద్‌కు పిలుపునిచ్చారు. బుధవారం అమ్మవారి ఆలయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలు, పాడేరు గ్రామ పెద్దలు, వర్తక సంఘం నేతలు సమావేశమయ్యారు. వీరంతా బాలరాజు నిరంకుశ విధానాలను ఎండగట్టారు. ఆలయ అభివృద్ధ్దికి పైసా కూడా ఖర్చుపెట్టని వ్యక్తి పదవి ముగుస్తున్న సమయంలో దాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని తప్పుబట్టారు. మాజీ మంత్రి ఎం.మణికుమారి, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త గిడ్డి ఈశ్వరి, మాజీ జెడ్పీ చైర్ పర్సన్ వంజంగి కాంతమ్మ, బీజేపీ నేత కురుసా బొజ్జయ్య, సర్పంచ్ కిల్లు వెంకటరత్నం, వర్తక సంఘం అధ్యక్షులు రొబ్బి శంకరరావు, టీడీపీ నేతలు బొర్రా నాగరాజు, విజయరాణి, కొట్టగుల్లి సుబ్బారావు, రొబ్బి రాముల ఆధ్వర్యంలో సమావేశమై ఆలయాన్ని పరిరక్షించుకుంటామని ప్రతిన బూనారు. మణికుమారి మాట్లాడుతూ ఆలయ కమిటీ, ధర్మకర్తలు, వర్తక సంఘం, గ్రామ పెద్దలంతా అమ్మవారి ఆలయానికి కృషి చేస్తే ఎక్కడ నుంచో వచ్చిన మంత్రి పెత్తనం చెలాయించడం దారుణమన్నారు. గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ బాలరాజు చర్యలను ప్రతీ ఒక్కరూ అడ్డుకోవాలన్నారు. వంజంగి కాంతమ్మ మాట్లాడుతూ మోదకొండమ్మతల్లి ఆలయం మంత్రి బాలరాజుకు సొత్తు కాదన్నారు. నేడు బంద్ ఆలయాన్ని దేవాదాయ శాఖకు అప్పగించడాన్ని నిరసిస్తూ గురువారం పాడేరు పట్టణ బంద్‌కు పిలుపునిచ్చారు. ఆలయాన్ని యథావిధిగా భక్తుల ఆధీనంలోనే ఉంచే వరకు పోరాడతామని నేతలు స్పష్టం చేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం నేతలు నవర గోవిందరావు, బి.కెజియారాణి, పూసర్ల గోపి, నిక్కుల సింహాచలం, వెల్డింగ్ శ్రీను, లకే రత్నాభాయి పాల్గొన్నారు. -
‘గిరి’గీసుకున్నారా..
సమైక్య ఘోష పట్టని గిరిజన మంత్రులు ఒకరిది వి‘భజన’వాదం మరొకరిది మౌనవేదం ఇద్దరూ...ఇద్దరే...! ఒకరిది విభజనవాదం...మరొకరిది పలాయనవాదం. విభజనపై రాష్ట్రం మండుతుంటే....ఒకరు పార్టీ జపం చేస్తున్నారు...మరొకరు మౌనంగా చోద్యం చూస్తున్నారు. జిల్లాలో ‘హస్త’రేఖలు గల్లంతవుతుంటే ఈ ఇద్దరు మాత్రం ‘గిరి’గీసుకు కూర్చుకున్నారు. జనం ఘోష వినబోమంటూ ఒట్టు పెట్టుకున్నారు... సమైక్యవాదుల ఆగ్రహానికి కేంద్రబిందువులవుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత కూడా జిల్లాకు చెందిన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు వైఖరిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. ఓటేసి గెలిపించిన నియోజక వర్గ ప్రజల కంటే రాష్ట్రాన్ని నిలువునా చీల్చిన కాంగ్రెస్ అధిష్టానమే ముఖ్యమన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్నారు. అడ్డగోలు విభజన పట్ల జిల్లావ్యాప్తంగా నిరసనలు వ్యక్తమౌతుండగా బాలరాజు మాత్రం కనీస విచారం కూడా వ్యక్తం చేయకుండా పార్టీ అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ప్రకటిస్తూ సమైక్యవాదుల ఆగ్రహానికి గురౌతున్నారు. బాలరాజు వైఖరిని నిరసిస్తూ అరకుతో పాటు పలుచోట్ల సమైక్యవాదులు బుధవారం నాడు ఆయన దిష్టిబొమ్మలు, ఫ్లెక్సీలను దహనం చేశారు. జిల్లాకు చెందిన కేంద్రమంత్రి పురందేశ్వరి, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు లోక్ సభలో విభజన బిల్లు ఆమోదం పొందిన వెంటనే మంగళవారం నాడే రాజీనామాలు సమర్పించగా బాలరాజు ఆ దిశగా ఆలోచనే చేయలేదు. బుధవా రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో బాలరాజు మాజీ అయిపోయారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉండగా విశాఖ మన్యం అభివృద్ధి, నియోజక వర్గ ప్రగతి గురించి ఏనాడూ పట్టించుకొన్న పాపానే పోలేదనే విమర్శలనెదుర్కొన్న బాలరాజు రెండు రోజుల క్రితం మాత్రం హడావుడిగా కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు చేయడం వివాదాస్పదమైంది. శంకుస్థాపనలు చేసిన పలు పథకాలకు నిధులు మంజూరు కాలేదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. మౌనం వహించిన కిశోర్ అరకు లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ విభజన వ్యవహారంలో మౌనంగా ఉండడం గిరిజనుల్లో ఆగ్రహాన్ని రగిల్చింది. మిగిలిన కేంద్ర మంత్రులు కనీసం లోక్‌సభలో విభజన ప్రక్రియకు వ్యతిరేకంగా నిరసన తెలుపగా కిశోర్ అటువంటి ప్రయత్నమే చేయలేదు. విభజన బిల్లు ఆమోదం తరువాత ఎక్కడా కనీసం నోరు కూడా విప్పలేదు. మౌనమే శ్రీరామరక్షగా మిన్నకున్నారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ తమకు ప్రాతినిధ్యం వహిస్తూ కూడా తమ గోడు పట్టించుకోని వీరి పట్ల మండిపడుతున్న గిరిజనులు బుధవారం అరకులో బాలరాజు, కిశోర్ ఫ్లెక్సీలను దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. -
అనైక్య పార్టీ.. పెప్పర్ స్ప్రే గుర్గు
అనైక్య పార్టీ.. పెప్పర్ స్ప్రే గుర్తు న్నాపురం(కొయ్యలగూడెం), ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు అనైక్య పార్టీ అని, గుర్తుగా ‘పెప్పర్స్ స్ప్రే’ పెడితే బాగుంటుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎద్దేవా చేశారు. వైసీపీ కన్నాపురం గ్రామ కన్వీనర్ గాడిచర్ల సోమేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో బాలరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని పక్కదారి పట్టించటానికే సీఎం రాజీనామా డ్రామా ఆడుతున్నారని, ఇందుకు లగడపాటి, ఎన్జీవో అసోసియేషన్ నేత అశోక్‌బాబు సహకరిస్తున్నారన్నారు. పదవిలో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో చేయక.. విభజన అంశం పీకల మీదకు వచ్చిన తర్వాత రాజీనామా చేస్తే ఏం ప్రయోజనమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం మహానేత వైఎస్ పాలన వంటి సువర్ణ యుగం అందించడంతోపాటు ఆడపడుచులకు కోట్లాది రూపాయలు డ్వాక్రా రుణాలు రద్దు చేయడం ఖాయమన్నారు. సోనియాను చూసి ఇందిర, రాజీవ్‌ల ఆత్మలు ఘోషిస్తుంటాయని, భారతదేశ రాజకీయాల్లో మహిళా నియంతగా ఆమె శాశ్వత అపకీర్తిని మూటకట్టుకుందని పేర్కొన్నారు. సమైక్యవాదులు గడ్డం అబ్బులు, శీలం శ్రీను, వల్లూరి మాధవరావు, కె.సురేష్, అల్లూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. -
'విశ్వాసానికి మారుపేరు వైఎస్ జగన్'
ఇడుపులపాయ(వైఎస్సార్ జిల్లా): విశ్వాసానికి మారుపేరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వ్యాఖ్యానించారు. సమైక్యం కోసం పోరాడుతున్న జగన్‌పై ఆరోపణలు చేసిన రఘురామరాజు పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రఘురామరాజు పార్టీలో ఉన్నది 90రోజులేనని బాలరాజు చెప్పారు. స్వార్థ ప్రయోజనాలకోసం ఆయన పార్టీలో చేరారని బాలరాజు ఆరోపించారు. రఘురామరాజు ప్రయోజనాలు నెరవేరవనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేశారని బాలరాజు విమర్శించారు. రఘురామరాజు డబ్బు మదంతో మాట్లాడుతున్నారని అన్నారు. జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి ఆయనకు లేదని బాలరాజు చెప్పారు. -
రెంటికి చెడ్డ రేవడి కిరణ్!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుత పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైనట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీసుకున్న నిర్ణయం తిరుగుబాటు చేశానని సొంతంగా బిల్డప్ ఇచ్చుకున్న కిరణ్ కుమార్ రెడ్డిని సీమాంధ్ర ప్రాంత నాయకుల నుంచి సానుకూల స్పందన కరువైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకంగా మీడియాలో వ్యాఖ్యలు చేస్తూ ఆ ప్రాంత నాయకుల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కోంటున్నారు. ఇక ఎలాగు అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో కుడితిలో పడిన ఎలుక పరిస్థితిలా మారింది కిరణ్ వ్యవహారం. సోనియా గాంధీతో రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మినారాయణ సమావేశం కావడంతో పీఠం కదలుంతుందేమో అనే ఆందోళనకు కిరణ్ లోనయ్యారు. దాంతో తనకు అనుకూలంగా ఉన్న టెలివిజన్ చానెల్స్ లో కన్నాపై వ్యక్తిగతంగా దాడికి పూనుకున్నారు. కాగా ముఖ్యమంత్రి పాల్గొన్నరచ్చబండ కార్యక్రమానికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పి బాలరాజు హాజరుకాకపోవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. విశాఖపట్నంలో ఉన్న బాలరాజు చోడవరంలో జరిగిన రచ్చబండకు గైర్హాజరుకావడంతో సీఎం క్యాంపులో లుకలుకలున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. రచ్చబండ కార్యక్రమానికి తనకు ఆహ్వానం లేదని.. ఆ కార్యక్రమం గురించి వివరాలు అందలేదని బాలరాజు మాట్లాడటంతో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మధ్య పెద్ద అగాథమే ఉన్నట్టు తెలుస్తోంది. బాలరాజుకు ఆహ్వనం అందకపోవడంపై మరో మంత్రి కొండ్రు మురళీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.., ఈ ఘటనకు కారణమైన అధికారులపై చర్య తీసుకుంటామన్నారు. అయితే తాము బాలరాజుకు ముందుగానే సమాచారం అందించామని పై వాదనలకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు తెలపడం మరింత గందరగోళానికి దారితీసింది. తన జిల్లాకే చెందిన గంటా శ్రీనివాసరావుకు ప్రాధాన్యత ఇస్తూ, తనను పక్కన పెట్టడంతో మనస్తాపం చెందిన బాలరాజు సీఎం పర్యటనకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అవుదామనే ఆశతో విభజనకు వ్యతిరేకం అంటూ ఫోజు కొట్టిన కిరణ్ కు తెలంగాణ ప్రాంతంలోని ఇతర పార్టీల నేతల నుంచి కాకుండా స్వంత పార్టీ నేతలు, మంత్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఊహించని పరిణామం. రచ్చబండ కార్యక్రమంతో మెదక్ జిల్లాలో పర్యటిద్దామని ప్రయత్నించిన కిరణ్ భంగపాటుకు గురైన సంగతి తెలిసిందే.