‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’ | dharmana prasada rao slams ap govt action over special status protest | Sakshi
Sakshi News home page

‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’

Published Thu, Jan 26 2017 1:39 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’ - Sakshi

‘ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదు’

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ లో అప్రజాస్వామిక పాలన సాగుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రజలను ఆకాంక్షను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందని, ప్రపంచంలో ఇలాంటి అరెస్ట్ లు ఎక్కడా జరగలేదని వాపోయారు. దుష్ట సంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని ధ్వజమెత్తారు. ఎంత అణచివేస్తే ఉద్యమం అంత ఉధృతమవుతుందని ధర్మాన హెచ్చరించారు.

అణచివేత, బెదిరింపులతో ప్రజా ఉద్యమాన్ని ఆపలేరని మాజీ మంత్రి బాలరాజు అన్నారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రజలు ప్రత్యేక హోదా కావాలంటున్నారని, చంద్రబాబు ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement