ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త రఘురామ కృష్ణంరాజు ఆదివారం హైదరాబాద్లో వెల్లడించారు. అందుకోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు. తన పిటిషన్ త్వరలో విచారణకు రాబోతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ది సాధ్యమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో ఎంతవరకైన వెళ్లి పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు.