సమైక్య శంఖారావానికి కోర్టు అనుమతి ఇస్తుందనే నమ్మకం ఉందని ఆ పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు.
నరసాపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈనెల 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చేపట్టిన సమైక్య శంఖారావానికి కోర్టు అనుమతి ఇస్తుందనే నమ్మకం ఉందని ఆ పార్టీ నేత రఘురామ కృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ సీపీ, ఎంఐఎం, సీపీఎంతోపాటు ఇతర పార్టీల్లో ఉన్న సమైక్యవాదులు కూడా కలిసి రావాలని ఆయన మంగళవారమిక్కడ పిలుపునిచ్చారు.
రెండు నెలలకు పైగా సమైక్య ఉద్యమం చేసిన నరసాపురం లోక్సభ నియోజకవర్గ పరిధిలోని క్లాస్ ఫోర్ ఉద్యోగులకు రఘురామ కృష్ణం రాజు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. వైఎస్ఆఎస్ కాంగ్రెస్ పార్టీ సమైక్య శంఖారావం సభకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో ఆపార్టీ కోర్టును ఆశ్రయించింది.