
సాక్షి, పశ్చిమ గోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఓటు వేస్తే ఏపీకి ప్రత్యేక హోదా రాదని వైఎస్సార్ సీపీ నేత కనుమూరి రఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం రఘురామ కృష్ణంరాజు ఆధ్వర్యంలో భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాల, డీఎన్ఆర్ కళాశాలల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్వీనర్లు గ్రంధి శ్రీనివాస్, పాతపాటి సర్రాజు, ఏఎస్ రాజు, మేడిద జాన్సన్, గాదిరాజు సుబ్బరాజు, గూడూరి ఉమాబాల తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాటం చేస్తున్నారని చెప్పారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment