పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అసెంబ్లీలో నిగ్రహాన్ని కోల్పోయారు. తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నలను లేవనెత్తతూ రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘించారంటూ స్పీకర్ విజయ్ కుమార్ సిన్హా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ విజయ్ కుమార్ సిన్హాతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారంటూ నితీష్‌కుమార్ అతని బీజేపీ మిత్రపక్షం ప్రశ్నలు లెవనెత్తారు. దీంతో కలత చెందిన ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ మీరు పదేపదే ఈ ప్రశ్నలనే లేవనెత్తడమే కాక అందర్నీ ఈ విషయంలోకి లాగుతున్నారంటూ మండిపడ్డారు.
గతంలో ఎప్పడూ లేనివిధంగా ప్రవర్తస్తాన్నరంటూ కాస్త అత్యుత్సహాం ప్రదర్శించారు. అసలేం జరిగిందంటే ...సరస్వతీ పూజ వేడుకల సందర్భంగా కోవిడ్ పరిమితులను ఉల్లంఘించినందుకు కొంతమంది బీజేపీ మద్దతుదారులను అరెస్టు చేయడం జరిగింది. అయితే స్పీకర్ జోక్యం చేసుకునేందుకు యత్నించగా పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో సిన్హా పోలీసులపై చర్య తీసుకోవాలని అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. పైగా బీజేపీ నేతలు కూడా దీనికి వంత పాడటంతో నితీష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది.
ఈ మేరకు నితీష్ కుమార్ మాట్లాడతూ.."నేను మా సభ్యులకు కూడా చెప్పాలనుకుంటున్నాను. ఆ ఘటన పై విచారణ జరుగుతోంది అని చెబుతున్నప్పటికీ మీరు ఈ ప్రశ్నను పదే పదే లేవనెత్తుతున్నారు. మీరు విచారణ గురించి ఆందోళన చెందుతున్నారా లేక కోర్టుకు వెళ్లాలనుకుంటున్నారా. అయినా నేను కూడా ఆ ఘటన గురించి బాధపడుతున్నాను, మీ ఆవేదనను కూడా అర్థం చేసుకుంటున్నాను. మీరు ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు. నేను చెప్పేది వినండి. ఇలాంటి వాటిని అంగీకరించను అని స్పీకర్‌పై ఆగ్రహంతో విరుచుకు పడ్డారు. అయితే స్పీకర్ ముఖ్యమంత్రిని వారించేందకు యత్నించినప్పటకీ ఆయన వినేందుకు నిరాకరించారు.
(చదవండి: లోక్ సభలో ‘మోదీ.. మోదీ..’)
Comments
Please login to add a commentAdd a comment