‘నాకు పురుషులతో నిద్రించే అలవాటు లేదు’ | Karnataka Speaker Said I Do Not Sleep With Men Or Anyone | Sakshi
Sakshi News home page

కర్ణాటక స్పీకర్‌ జుగుప్సాకర వ్యాఖ్యలు

Published Fri, Mar 22 2019 9:52 AM | Last Updated on Fri, Mar 22 2019 10:01 AM

Karnataka Speaker Said I Do Not Sleep With Men Or Anyone - Sakshi

బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ మరో సారి జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. తనకు పురుషులతో పడుకునే అలవాటు లేదని తెలిపారు. కర్ణాటక సీనియర్‌ కాంగ్రెస్‌ లీడర్‌ కేహెచ్‌ మునియప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ... నాకు పురుషులతో నిద్రించే అలవాటు లేదు అని తెలిపారు.

ఇంత దరిద్రపు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ అధిష్టానం మునియప్పకు కోలార్‌ నియోజకవర్గం టికెట్‌ కేటాయించింది. ఈ విషయం నచ్చని రమేష్‌ కుమార్‌ మునియప్పపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత నెలలో ఓ కమ్యూనిటీ హాల్‌ ప్రారంభోత్సవానికి హాజరైన మునియప్ప రమేష్‌ కుమార్‌ను ఉద్దేశిస్తూ... మేమిద్దరం భార్యాభర్తల్లాంటి వాళ్లం. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు.

తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన మునియప్ప.. ‘నాకు పురుషులతోనే కాదు ఎవరితోనూ.. కలిసి నిద్రించే అలవాటు లేదు. నాకు భార్య ఉంది.. దశాబ్దాల క్రితమే ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆయనకు నాతో కలిసి నిద్రపోవాలని ఉందేమో.. కానీ నాకు లేదు. అంతేకాక నాకు ఎవరితోను వివాహేతర సంబంధాలు కూడా లేవు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే మునియప్పకు టికెట్‌ ఇవ్వడాన్ని కొలార్‌ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. (‘నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉంది’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement