Muniyappa
-
లబ్ధి దారుల ఇళ్లకే రేషన్.. భేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇళ్లకు ఎండీయూల్లో రేషన్ అందించడం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కె.హెచ్.మునియప్ప ప్రశంసించారు. తమ రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానాన్ని ప్రవేశపెట్టే దిశగా అధ్యయనం చేస్తామని చెప్పారు. ఆయన శుక్రవారం విజయవాడలో పౌరసరఫరాల శాఖ గోడౌన్ల నిర్వహణ, ఎండీయూ వాహనాలు, రేషన్ సరుకుల ప్యాకేజింగ్, పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుతో కలిసి పరిశీలించారు. పేదలకు పౌష్టికాహార బియ్యంతో పాటు రాయలసీమ జిల్లాల్లో చిరుధాన్యాలు, పట్టణ ప్రాంతాల్లో ఫోర్టిఫైడ్ గోధుమపిండి పంపిణీ గురించి తెలుసుకుని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆయన్ని మంత్రి కారుమూరి సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో పౌరసరఫరాల శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్ తదితరులు పాల్గొన్నారు. -
‘నాకు పురుషులతో నిద్రించే అలవాటు లేదు’
బెంగళూరు : వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుండే కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ మరో సారి జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. తనకు పురుషులతో పడుకునే అలవాటు లేదని తెలిపారు. కర్ణాటక సీనియర్ కాంగ్రెస్ లీడర్ కేహెచ్ మునియప్ప వ్యాఖ్యలపై స్పందిస్తూ... నాకు పురుషులతో నిద్రించే అలవాటు లేదు అని తెలిపారు. ఇంత దరిద్రపు వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే.. లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం మునియప్పకు కోలార్ నియోజకవర్గం టికెట్ కేటాయించింది. ఈ విషయం నచ్చని రమేష్ కుమార్ మునియప్పపై విమర్శలు చేయడం ప్రారంభించాడు. గతకొంత కాలంగా వీరిద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గత నెలలో ఓ కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి హాజరైన మునియప్ప రమేష్ కుమార్‌ను ఉద్దేశిస్తూ... మేమిద్దరం భార్యాభర్తల్లాంటి వాళ్లం. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని స్పష్టం చేశారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన మునియప్ప.. ‘నాకు పురుషులతోనే కాదు ఎవరితోనూ.. కలిసి నిద్రించే అలవాటు లేదు. నాకు భార్య ఉంది.. దశాబ్దాల క్రితమే ఆమెతో నాకు వివాహం జరిగింది. ఆయనకు నాతో కలిసి నిద్రపోవాలని ఉందేమో.. కానీ నాకు లేదు. అంతేకాక నాకు ఎవరితోను వివాహేతర సంబంధాలు కూడా లేవు’ అంటూ చెప్పుకొచ్చారు. అయితే మునియప్పకు టికెట్ ఇవ్వడాన్ని కొలార్ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. (‘నా పరిస్థితి అత్యాచార బాధితురాలిలా ఉంది’) -
అబద్ధాల కేసీఆర్: కేంద్ర మాజీ మంత్రి మునియప్ప
సాక్షి, నిజామాబాద్‌అర్బన్: ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద అబద్దాల కోరు అని, ఇచ్చిన హామీలను నెరవేర్చలే దని కేంద్ర మాజీ మంత్రి మునియప్ప విమర్శించారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ఇంటింటికీ నీళ్లు ఇస్తానని ఇవ్వలేదని, ఉద్యోగాలు ఇవ్వలేదని, ఎస్సీ, ఎస్టీలకు భూములు ఇవ్వలేదని, మైనారిటీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అబద్దపు హామీలతో మోసం చేసిన కేసీఆర్‌ను ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడించాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్ ఎంపీ కవిత కూడా ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. తెలంగాణ తల్లి సోనియాగాంధీ అని, ఆత్మబలిదానాలను చూసి ఆమె తెలంగాణ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చాడని, కానీ, ఆ తర్వాత మాట మార్చాడని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వస్తే ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని గుర్తు చేసిన మునియప్ప.. అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీతోనే మేలు జరుగుతుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి తాహెర్, టీపీసీసీ నేతలు గడుగు గంగాధర్, మహేశ్‌కుమార్‌గౌడ్, కర్ణాటక రాష్ట్రంలోని ఖానాపూర్ ఎమ్మెల్యే అంజలిచౌహాన్, కేశవేణు, మీసాల సుధాకర్, సుభాష్‌జాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు హిందూపురానికి రాహుల్ రాక
హిందూపురం, న్యూస్‌లైన్: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం అనంతపురం జిల్లాలోని హిందూపురం రానున్నారు. ఎంజీఎం మైదానంలో బహిరంగసభ ఏర్పాట్లను మంగళవారం కేంద్ర మంత్రి మునియప్ప పరిశీలించారు. సభ ఆలస్యమైతే ఇబ్బందులు తలెత్తకుండా విద్యుద్దీపాలు ఏర్పాటు చేయించారు. -
'తెలంగాణకు స్వేచ్చ, స్వతంత్రం ఇచ్చింది సోనియానే'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని కేంద్రమంత్రి మునియప్ప తెలిపారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణకు స్వేచ్ఛ, స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీనే అని మునియప్ప అన్నారు. రైల్వేశాఖామంత్రిగా తెలంగాణకు 15వేల కోట్ల రూపాయలను కేటాయించానని మునియప్ప తెలిపారు. రైల్వే లైన్లు అభివృద్ధి చేయడమే కాకుండా తెలంగాణ ప్రాంతానికి కొత్త రైళ్లను కేటాయించామన్నారు. తెలంగాణ ప్రాంతంలో అభివృద్దికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. కర్ణాటకలో 28 ఎంపీ సీట్లలో 20 కాంగ్రెస్ గెలుస్తుందని మునియప్ప ధీమా వ్యక్తం చేశారు. -
8న కోలారు-చిక్కబళ్లాపురం రైలు ప్రారంభం
కోలారు, న్యూస్‌లైన్ : కోలారు, చిక్కబళ్లాపురం జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన కోలార్ - చిక్కబళ్లాపురం రైలును ఈ నెల 8న ప్రారంభిస్తున్నట్లు కేంద్ర మంత్రి కే హెచ్ మునియప్ప తెలిపారు. సోమవారం నగరంలోని ప్రభుత్వ అతిథి గృహం లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సుమారు రూ. 450 కోట్ల వ్యయంతో నిర్మించిన బ్రాడ్‌గేజ్ లైన్‌ను ఈ నెల 8న కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే ప్రారంభిస్తారన్నారు. మైసూరు మహారాజ్‌లు ప్రారంభించి న రైళ్లను కొనసాగించాలని స్థానికుల నుంచి వచ్చిన డిమాండుకు అనుగుణంగా బ్రాడ్ గేజ్‌గా మార్చామన్నారు. అదే విధంగా కోలారు - వైట్‌ఫీల్డ్, కోలారు- ముళబాగిలు, కేజీఎఫ్-కుప్పం, బంగారుపేట-మారికుప్పం, శ్రీనివాసపురం - మదనపల్లి తదితర రైల్వేలైన్లకు సంబంధించి భూ స్వాధీనం, సర్వే పనులు జరుగుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో బంగారుపేట ఎమ్మెల్యే నారాయణస్వామి, మాజీ మంత్రి నిసార్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ మాజీ అధ్యక్షుడు జన్నఘట్ట వెంకటమునియప్ప పాల్గొన్నారు.